News September 5, 2024
రాష్ట్రానికి భారీ నష్టం.. ఆదుకోవాలి: చంద్రబాబు

AP: భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం చంద్రబాబు వివరించారు. 1.81లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంట మునిగి రూ.1056 కోట్ల నష్టం జరిగిందన్నారు. 18,453 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 3756 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని పెద్ద మనసుతో ఆదుకుని నష్టనివారణ చేపట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
Similar News
News December 24, 2025
ఏజెన్సీ ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు

AP: ఏజెన్సీలోని ఆసుపత్రులకు మందులు తదితరాలను ఇకనుంచి డ్రోన్ల ద్వారా అందించనున్నారు. ఈమేరకు ‘రెడ్ వింగ్’ అనే సంస్థతో వైద్యారోగ్యశాఖ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఈ సంస్థ అరుణాచల్ ప్రదేశ్‌లో ఇలాంటి సేవలు అందిస్తోంది. పాడేరు కేంద్రంగా 80 KM పరిధిలోని ఆసుపత్రులకు ఈ సంస్థ డ్రోన్లతో మందులు అందిస్తుంది. డ్రోన్లు తిరిగి వచ్చేటపుడు రోగుల రక్త, మల, మూత్ర నమూనాలను తీసుకువస్తాయని కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు.
News December 24, 2025
ITRలో తేడాలున్నాయా? డిసెంబర్ 31లోపు సరిచేసుకోండి

IT శాఖ నుంచి మెసేజ్ వస్తే కంగారు పడకుండా రిటర్నులను ఒకసారి చెక్ చేసుకోండి. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలు, సెక్షన్ 80C, 80D క్లెయిమ్స్‌లో పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆఫీసులో చెప్పకుండా నేరుగా ITRలో డిడక్షన్స్ చూపించిన వారు ఆధారాలతో ఫామ్-16ను సరిపోల్చుకొని, తప్పులుంటే డిసెంబర్ 31లోపు రివైజ్డ్ రిటర్నులు ఫైల్ చేయాలి. నిర్లక్ష్యం చేస్తే పెనాల్టీలు తప్పవు.
News December 24, 2025
సీక్రెట్ శాంటా.. మీకు ఏ గిఫ్ట్ వచ్చింది?

క్రిస్మస్ సంబరాల్లో భాగంగా ఆఫీసుల్లో ‘సీక్రెట్ శాంటా’ సందడి జోరుగా సాగుతోంది. HR టీమ్స్ గిఫ్ట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన కొలీగ్స్‌కు ఇష్టమైన బహుమతులను రహస్యంగా అందిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. రేపు క్రిస్మస్ సెలవు కావడంతో ఇవాళే ఆఫీసుల్లో శాంటా వేషధారణలో గిఫ్టులు పంపిణీ చేస్తున్నారు. మరి మీ ఆఫీసులో ఈ వేడుక జరిగిందా? మీకు ఏ గిఫ్టు వచ్చిందో కామెంట్ చేయండి.


