News October 31, 2024

భారీ నష్టాలు.. రూ.3లక్షల కోట్లు లాస్!

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీపావళికి రాకెట్లలా దూసుకుపోతాయనుకుంటే తోకపటాకులా తుస్సుమనడం ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. మధ్యాహ్నం ఒంటిగంటకు బీఎస్ఈ సెన్సెక్స్ 523 పాయింట్లు పతనమై 79,420, ఎన్ఎస్ఈ నిఫ్టీ 137 పాయింట్ల నష్టంతో 24,203 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో రూ.3లక్షల కోట్ల సంపద ఆవిరైంది. IT స్టాక్స్ ఘోరంగా క్రాష్ అవుతున్నాయి. TECHM, HCLTECH, INFY, TCS 3%మేర నష్టపోయాయి.

Similar News

News January 3, 2025

వైసీపీకి 11 సీట్లు.. అందుకే: చింతామోహన్

image

AP: మాజీ సీఎం జగన్‌పై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై 11 కేసులున్నాయని, అందుకే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని తెలిపారు. ఆయన మీద కేసులు ఎక్కువగా ఉంటే, ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవేమో అని ఎద్దేవా చేశారు. YCPని ప్రజలు పట్టించుకోవడంలేదన్నారు. డబ్బుల కోసం కొందరు కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం చంద్రబాబు స్పందించాలని ఆయన కోరారు.

News January 3, 2025

ఆ ఉద్యోగులకు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

image

TG: రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఫైరయ్యారు. ఈ మేరకు ప్రజల నుంచి ఫిర్యాదు అందుతున్నాయని తెలిపారు. అధికారులు అవినీతికి పాల్పడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తీరు మార్చుకోకపోతే ACBకి వివరాలు పంపిస్తానని, విజిలెన్స్ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సస్పెండైన వారిని మళ్లీ ఉద్యోగంలోకి రాకుండా చేస్తామన్నారు. అవినీతి సొమ్ము రికవరీ చేయిస్తానని చెప్పారు.

News January 3, 2025

మళ్లీ లాక్డౌన్ రానుందా?

image

ఐదేళ్ల తర్వాత కరోనా లాంటి మరో మహమ్మారి చైనాను వణికిస్తోంది. శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన <<15048897>>HMPV<<>> (హ్యూమన్ మెటాన్యుమోవైరస్) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 2019 DEC31న చైనాలో కరోనా తొలి కేసును గుర్తించగా ఊహించని విధంగా 3 నెలల్లోనే ప్రపంచమంతా వ్యాపించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ప్రభుత్వాలు అలర్ట్ అవ్వాలని, లేకపోతే మళ్లీ లాక్డౌన్ రోజులు రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.