News June 4, 2024
కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ మెజారిటీలు

TG: పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీ దిశగా దూసుకెళుతున్నారు. నల్గొండలో 3,44,000 ఓట్ల ఆధిక్యంతో రఘువీర్రెడ్డి కొనసాగుతున్నారు. అటు ఖమ్మంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి 3,24,000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.
Similar News
News January 9, 2026
TET ఫలితాలు విడుదల

AP: రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 2.48 లక్షల మంది ఎగ్జామ్స్ రాయగా 97,560 మంది ఉత్తీర్ణులైనట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు అధికారిక <
News January 9, 2026
ఇంటర్ కాలేజీలకు సెలవులు ఎప్పుడంటే?

TG: రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు విద్యాశాఖ సంక్రాంతి సెలవులను ఖరారు చేసింది. ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులు ప్రకటించినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. మరోవైపు స్కూళ్లకు ఈనెల 10నుంచి 16వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే APలో ఇంటర్ కాలేజీల సెలవులపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
News January 9, 2026
రాజాసాబ్ టికెట్ హైక్ మెమో సస్పెండ్

రాజాసాబ్ మూవీ టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వ మెమోను హైకోర్టు కొట్టేసింది. దీంతో పాత రేట్లకే టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది. కాగా తెలంగాణ హోంశాఖ కార్యదర్శి అర్ధరాత్రి తర్వాత హైక్ మెమో ఇచ్చారని, తనకు ఆ అధికారం లేదని లాయర్ శ్రీనివాస్ HCకి వెళ్లారు. దీంతో ఇకపై మెమోలు జారీ చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ రేట్స్ పెంచాలి అనుకుంటే జీవో 120 ప్రకారం రూ.350 మించకూడదని తేల్చిచెప్పింది.


