News March 29, 2025
‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి భారీగా దరఖాస్తులు

TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 2 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 5వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగియనుండగా, ఏప్రిల్ 6 నుంచి 30 వరకు అప్లికేషన్లను పరిశీలించనున్నారు. జూన్ 2న మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేస్తారు.
Similar News
News March 31, 2025
పాపం మోనాలిసా

కుంభమేళాలో పూసలమ్మే మోనాలిసా SM వల్ల పాపులరైంది. ఆమెవి కైపెక్కించే కళ్లు అని, హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదంటూ నెటిజన్లు పొగిడారు. దీంతో బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తాను తీసే ‘ది డైరీ ఆఫ్ మణిపుర్’లో పాత్ర ఇస్తానని ప్రకటించడంతో మోనాలిసా ఫేట్ మారిపోయిందని అంతా భావించారు. కానీ అంతలోనే ట్విస్ట్ చోటుచేసుకుంది. అత్యాచార ఆరోపణలతో సనోజ్ అరెస్ట్ అయ్యారు. దీంతో మోనాలిసా సినిమాపై నీలినీడలు కమ్ముకున్నాయి.
News March 31, 2025
బలూచిస్థాన్‌లో భూకంపం

వరుస భూకంపాలు మానవాళిని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.6గా నమోదైంది. కరాచీలోనూ భూప్రకంపనలు కనిపించాయి. బలూచిస్థాన్‌కు 65కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇవాళ మధ్యాహ్నం భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లో <<15949405>>భూకంపం<<>> వచ్చిన విషయం తెలిసిందే.
News March 31, 2025
‘జయం’లో ముందు హీరోయిన్గా ఆ యాంకర్.. చివరికి

నితిన్ హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం ‘జయం’ సూపర్ హిట్‌గా నిలిచింది. హీరోయిన్ సదా నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. తాజాగా నితిన్ ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో ముందుగా రష్మిని హీరోయిన్గా అనుకున్నారని తెలిపారు. ఆమెతో కలిసి రిహార్సల్స్ చేసినట్లు చెప్పారు. అయితే చివరి నిమిషంలో సదాను తీసుకువచ్చారని పేర్కొన్నారు. కాగా యాంకర్‌గా రాణిస్తున్న రష్మి పలు సినిమాల్లో సైతం నటించారు.