News August 29, 2025

ఫుడ్ ప్రాసెసింగ్‌లో అపార అవకాశాలు: చంద్రబాబు

image

AP: లైవ్ స్టాక్, ఆక్వా కల్చర్ వంటి రంగాల్లో AP అగ్రస్థానంలో ఉందని CM చంద్రబాబు తెలిపారు. ‘ఫుడ్ ప్రాసెసింగ్‌లో వ్యాపారులకు అపార అవకాశాలు ఉన్నాయి. దేశ ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్ర వాటా 9%(50 బి.డా.)గా ఉంది. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా రాష్ట్రం పేరు గాంచింది. రైతుల కోసం అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లు అన్వేషిస్తున్నాం. వ్యవసాయం నుంచి 35 శాతం GSDP వచ్చే ఏకైక రాష్ట్రం మనది’ అని తెలిపారు.

Similar News

News August 29, 2025

రాష్ట్రంలో 1039 కి.మీ. మేర రోడ్లు ధ్వంసం

image

TG: భారీ వర్షాలకు 37 R&B డివిజన్లలో 1039 కి.మీ.మేర రోడ్లు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. ‘794 సమస్యాత్మక రోడ్లు గుర్తించాం. 356 చోట్ల కాజ్ వేలు, కల్వర్టులు ధ్వంసమయ్యాయి. 37 చోట్ల రోడ్లు తెగిపోగా.. 10చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ చేశాం. 305 ప్రాంతాల్లో రాకపోకలకు నిలిచిపోగా, 236 చోట్ల క్లియర్ చేశాం. తాత్కాలిక పునరుద్ధరణకు రూ.53.76 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.1157.46 కోట్లు అవసరం’ అని తెలిపారు.

News August 29, 2025

జగన్ కోసం అవినాశ్ రెడ్డిని కాపాడుతున్నారు: షర్మిల

image

AP: వైఎస్ వివేకానంద హత్య కేసులో అన్ని సాక్ష్యాధారాలు ఉన్నా న్యాయం జరగడం లేదని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ‘వివేకా హత్య కేసు దర్యాప్తు మళ్లీ ఎందుకు జరగకూడదు? సునీత ఆరోపణల్లో నిజం ఉంది. CBI తలుచుకుంటే ఎప్పుడో దోషులకు శిక్ష పడేది. జగన్ కోసం అవినాశ్ రెడ్డిని కాపాడుతున్నారు. హత్య జరిగిన సమయంలో అవినాశ్ అక్కడే ఉన్నట్లు గూగుల్ మ్యాప్ లొకేషన్లు కూడా ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు.

News August 29, 2025

మహిళల క్రికెట్ కోసం గూగుల్‌తో ICC ఒప్పందం

image

ఉమెన్ క్రికెట్‌ను గ్లోబల్‌గా ప్రమోట్ చేసేందుకు గూగుల్ సంస్థతో ICC ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ఎక్కువ మందికి ఉమెన్ క్రికెట్ గురించి తెలిసే అవకాశం ఉంటుంది. ఉమెన్స్ వరల్డ్ కప్ 2025, ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 ఈవెంట్లను ప్రమోట్ చేయడంలో ఈ పార్ట్‌నర్‌షిప్ కీలకంగా వ్యవహరించనుంది. ఆండ్రాయిడ్, గూగుల్ జెమిని, గూగుల్ పిక్సెల్, గూగుల్ పే వంటి సర్వీసెస్ ద్వారా ఉమెన్ క్రికెట్‌ను ప్రమోట్ చేయనున్నారు.