News May 25, 2024
భారీగా పోస్టల్ బ్యాలెట్లు.. కౌంటింగ్ ఆలస్యమే!

APలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ దఫా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. భారీగా నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లే ఇందుకు కారణం. 2019లో 2.62లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటే ఈసారి ఆ సంఖ్య 4.97 లక్షలుగా ఉంది. వీటి లెక్కింపునకు సుదీర్ఘ సమయం పడుతుంది. పైగా వీటి తర్వాతే ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. జూన్ 4న ఉ.8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా.. 10గంటల తర్వాతే ట్రెండ్ తెలిసే పరిస్థితులున్నాయి.
Similar News
News November 5, 2025
గిరిజనులకు కొత్త గ్యాస్ కనెక్షన్లు: చిత్తూరు కలెక్టర్

జిల్లాలోని 411 మంది గిరిజనులకు నూతన గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. దీపం-2 పథకంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ప్రతి గిరిజన కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీ కాలనీలలో ప్రతి ఇంటిని సందర్శించి అర్హతలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
News November 5, 2025
ఫ్రీ బస్సు హామీ.. న్యూయార్క్లో విజయం

న్యూయార్క్ (అమెరికా) మేయర్గా <<18202940>>మమ్దానీ గెలవడంలో<<>> ఉచిత సిటీ బస్సు ప్రయాణ హామీ కీలకపాత్ర పోషించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే బస్ లేన్స్, వేగం పెంచుతానని ఆయన హామీ ఇచ్చారు. వాటితో పాటు సంపన్నులు, కార్పొరేట్లపై పన్నులు పెంచి ఉద్యోగులపై ట్యాక్సులను తగ్గిస్తామని చెప్పారు. నగరంలో ఇంటి అద్దెలను కంట్రోల్ చేస్తామని హామీ ఇవ్వడం ఓటర్లను ఆకర్షించింది.
News November 5, 2025
ఇండియన్ బ్యాంక్లో ఉద్యోగాలు

<


