News June 28, 2024
భారీగా తగ్గిన టమాటా ధర!

కొన్ని రోజులుగా దడ పుట్టిస్తున్న టమాటా ధరలు దిగి వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ రూ.50 నుంచి రూ.60 మధ్య విక్రయిస్తున్నారు. రెండు వారాలుగా కేజీ రూ.100 వరకు పెరిగిన టమాటా.. క్రమంగా దిగి వస్తోంది. సరఫరా పెరగడంతో రేట్లు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. మరి మీ ప్రాంతంలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News November 8, 2025
లాలూ 7 జన్మలెత్తినా మోదీ కాలేరు: అమిత్ షా

ఏడు జన్మలెత్తినా లాలూ ప్రసాద్ యాదవ్ చేసినట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ కుంభకోణాలు చేయలేరని కేంద్ర మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. రైల్వేకు లాలూ తీసుకొచ్చిన లాభాలను మోదీ ఎన్నటికీ తీసుకురాలేరన్న తేజస్వీ యాదవ్ కామెంట్లకు షా కౌంటరిచ్చారు. బిహార్లోని పూర్ణియాలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. అక్రమ వలసదారులను గుర్తిస్తామని, వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి దేశం నుంచి పంపిస్తామని చెప్పారు.
News November 8, 2025
రేపటి నుంచి మద్యం షాపులు బంద్: CP

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు HYD సీపీ సజ్జనార్ వెల్లడించారు. రేపు సా.6 నుంచి ఈ నెల 11న (పోలింగ్ తేదీ) సా.6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఈ నెల 14న కౌంటింగ్ సందర్భంగా ఉ.6 నుంచి 15న ఉ.6 గంటల వరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. నిర్దేశించిన సమయాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు కూడా మూసివేయాలన్నారు.
News November 8, 2025
₹60,799Crతో రోడ్ల నిర్మాణం.. రికార్డు: మంత్రి

TG: రాష్ట్రంలో ₹60,799Crతో రోడ్లు నిర్మించనున్నట్లు మంత్రి వెంకట్రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో ఇది రికార్డని, RRR నిర్మాణానికి ₹36,000Cr, HYD-VJA హైవే విస్తరణకు ₹10,400కోట్లు, HAM ప్రాజెక్టుకు ₹11,399Cr కేటాయించామన్నారు. ₹8,000Crతో మన్ననూర్-శ్రీశైలం ఎలివేటర్ కారిడార్, ₹20,000Crతో ఫ్యూచర్ సిటీ-బందరు పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. గ్రామాల్లో డబుల్ రోడ్లు వేస్తామన్నారు.


