News March 26, 2025

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ

image

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తుల క్యూలైన్ ఎంబీసీ వరకూ ఉంది. ఇక శ్రీవారిని నిన్న 64,252మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 25,943మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.68 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Similar News

News March 29, 2025

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు వరుసగా నాలుగవ రోజూ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.200 పెరిగి రూ.83,600లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 పెరగడంతో రూ.91,200 వద్ద కొనసాగుతోంది. అటు వెండి మాత్రం రూ.1000 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,13,000గా ఉంది.

News March 29, 2025

రూ.వందల కోట్లు పోగొట్టుకున్నాం.. రూ.35లక్షల ఆరోపణలా?: కడప మేయర్

image

AP: కడప MLA మాధవిపై మేయర్ సురేశ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలు మారుతూ పబ్బం గడిపే వారు తనపై నిందలేయడం విడ్దూరంగా ఉందన్నారు. ప్రజా సేవలో తమ కుటుంబం రూ.వందల కోట్లు పోగొట్టుకుందని, అలాంటిది కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు తనపై కేవలం రూ.35 లక్షల ఆరోపణలా? అని ధ్వజమెత్తారు. అక్రమాలకు పాల్పడిన వారే నిందలేస్తారా? అని మండిపడ్డారు. 3దశాబ్దాలుగా సేవ చేశామే తప్ప రాజకీయ లబ్ధి పొందలేదన్నారు.

News March 29, 2025

ఆ నీటిని వాడొద్దు.. చాలా ప్రమాదకరం!

image

ఎండాకాలం వచ్చేసింది. నీటి ఎద్దడి ప్రారంభమైంది. దీంతో చాలా చోట్ల, ముఖ్యంగా నగరాల్లో డ్రమ్ముల్లో నీటిని నిల్వ చేసి అవే వాడుకుంటుంటారు. ఇది చాలా ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘క్రిములు పుట్టేది, కీటకాలు గుడ్లు పెట్టేది నిల్వ నీటిలోనే. రోజుల తరబడి స్టోర్ చేసిన నీటిని వాడితే మలేరియా, చర్మవ్యాధులపాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఏరోజు నీరు ఆరోజు వాడుకోవడం మంచిది’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!