News June 17, 2024
ఫేక్మనీతో బ్లాక్మనీ చోరీకి భారీ స్కెచ్!
TG: ఫేక్మనీ తయారీ నేపథ్యంలో వచ్చిన ‘ఫార్జీ’ మూవీ తరహాలో HYD ఆదిభట్లలో ఓ ముఠా నకిలీ నోట్లతో భారీ చోరీకి స్కెచ్ వేసింది. ఓ చాక్లెట్ కంపెనీ ఓనర్ ఇంట్లో రూ.950కోట్ల బ్లాక్మనీ ఉందని అక్కడి వాచ్మన్ ముఠాకు చెప్పాడు. నగదు కొట్టేసి దాని స్థానంలో ఫేక్మనీ, తయారీకి ఉపయోగించే పౌడర్, లిక్విడ్ పెట్టి యజమానే కరెన్సీ తయారు చేస్తున్నట్లు ముఠా నమ్మించాలనుకుంది. కానీ ప్లాన్ బెడిసి కొట్టడంతో ముఠా కటకటాలపాలైంది.
Similar News
News January 17, 2025
పవన్ కళ్యాణ్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు: నాదెండ్ల
AP: సూపర్ సిక్స్లో భాగంగా ఉచిత గ్యాస్కు అధిక ప్రాధాన్యత ఇచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. త్వరలో ‘తల్లికి వందనం’ అమలు చేస్తామన్నారు. Dy.CM పవన్ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని చెప్పారు. జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
News January 17, 2025
ఆటగాళ్లపై నిబంధనలు విధించిన BCCI
ఇటీవల టీమ్ ఇండియా పేలవ ప్రదర్శన దృష్ట్యా BCCI ఆటగాళ్లపై నిబంధనలు విధించింది. ప్లేయర్లు జాతీయ జట్టులో చోటు, సెంట్రల్ కాంట్రాక్ట్ పొందాలంటే దేశవాళీలో ఆడటం తప్పనిసరని పేర్కొంది. కుటుంబ సభ్యులను వెంట తీసుకొచ్చే విషయంలో కోచ్, సెలక్షన్ ఆమోదం ఉండాలని తెలిపింది. లగేజీ పరిమిత బరువు ఉండాలని పేర్కొంది. వ్యక్తిగత సిబ్బందిని అనుమతించబోమని, ముందుగానే ప్రాక్టీస్ సెషన్లు వీడొద్దని ప్లేయర్లకు స్పష్టం చేసింది.
News January 17, 2025
జనవరి 17: చరిత్రలో ఈరోజు
1908: సినీనిర్మాత, దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ జననం
1917: సినీ నటుడు, తమిళనాడు మాజీ సీఎం ఎం.జి.రామచంద్రన్ జననం
1942: బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ జననం
1945: తెలంగాణ కవి, రచయిత మడిపల్లి భద్రయ్య జయంతి
2010: బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసు మరణం
1989: దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి భారతీయుడు కల్నల్ జె.కె బజాజ్