News July 26, 2024
భారీగా తగ్గిన ఐఫోన్ ధరలు

ఐఫోన్ ధరలను యాపిల్ సంస్థ తగ్గించింది. బడ్జెట్లో కస్టమ్ డ్యూటీని కేంద్రం తగ్గించడంతో ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేసింది. దీంతో 15 ప్రో మోడల్ ధర రూ.5100, ప్రో మ్యాక్స్ మోడల్ ఫోన్ల ధరలు రూ.6వేలు తగ్గాయి. SE మోడల్ ధర రూ.2300 తగ్గింది. భారత్‌లో తయారయ్యే ఐఫోన్ 13, 14, 15 మోడళ్ల ధరలూ రూ.300 తగ్గాయి. కాగా బడ్జెట్లో మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకాన్ని 20 నుంచి 15శాతానికి కేంద్రం తగ్గించింది.
Similar News
News March 28, 2026
VZM: టెన్త్ పరీక్షకు 99.72 శాతం హాజరు

జిల్లా వ్యాప్తంగా 119 కేంద్రాల్లో శనివారం నిర్వహించిన పదో తరగతి జీవ శాస్త్రం పరీక్షకు 99.72 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈవో మాణిక్యం నాయుడు తెలిపారు. జిల్లా మొత్తం 22969 మంది హాజరు కావల్సి ఉండగా వారిలో 22,905 మంది హాజరయ్యారన్నారు. కేవలం 64 మంది విద్యార్ధులు గైర్హాజరు అయినట్లు వెల్లడించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా పరీక్ష ప్రశాంతంగా జరిగిందన్నారు.
News March 28, 2026
రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం.. చెక్ చేసుకోండి!

పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించేందుకు కేంద్రం ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని అమలుచేస్తోంది. దీనిద్వారా అర్హులైన ప్రతి కుటుంబం ఏడాదికి రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం పొందవచ్చు. అయితే దీనికి అర్హులో కాదో చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలని కేంద్రం సూచించింది. <
News March 28, 2026
జియోలో 30 రోజుల కొత్త ప్లాన్స్ తెలుసా!

JIO నుంచి 30 రోజుల స్పెషల్ రీఛార్జ్ ప్లాన్స్ మరో 2 అందుబాటులోకి వచ్చాయి. రూ.365, రూ.355 ప్యాక్స్‌తో రీఛార్జ్ చేస్తే 30 రోజుల పాటు అన్లిమిటెడ్ కాల్స్, 100 SMS, 25GB డేటా, 3 నెలల పాటు JIO హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. డేటా పూర్తయినా 64kbps స్పీడ్‌తో డేటాను వినియోగించుకోవచ్చు.


