News April 6, 2024
ఢిల్లీలో హగ్గింగ్.. కేరళలో బెగ్గింగ్: స్మృతీ ఇరానీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌లో పోటీ చేయటంపై BJP మంత్రి స్మృతీ ఇరానీ సెటైర్లు వేశారు. ‘రాహుల్ వయనాడ్‌లో ఎందుకు పోటీ చేయాలి, యూపీలో పోటీ చేయవచ్చుగా అని ఇండియా కూటమిలోని వామపక్ష పార్టీలే అడుగుతున్నాయి. వారిని రాహుల్ ఢిల్లీలో కౌగిలించుకొని.. కేరళలో సీటు కోసం అడుక్కుంటున్నట్లు ఉంది’ అని ఆమె అన్నారు. కాగా.. వయనాడ్‌లో రాహుల్ పోటీ చేయడాన్ని ఆ రాష్ట్ర సీఎం పినరయి తప్పుబట్టడం తెలిసిందే.
Similar News
News November 17, 2025
గంజాయి టెస్ట్.. స్పాట్‌లోనే రిజల్ట్స్!

TG: గంజాయిని శాశ్వతంగా అరికట్టడానికి పోలీస్ శాఖ నయా టెక్నాలజీని ప్రవేశపెట్టింది. అనుమానం ఉన్నవారిని ‘యూరిన్ టెస్ట్ కిట్’తో టెస్ట్ చేసి స్పాట్‌లోనే ఫలితాన్ని నిర్ధారిస్తారు. సైబరాబాద్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, సిద్దిపేట కమిషనరేట్ల పరిధిలోని కొన్ని పోలీస్ స్టేషన్లను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయా పీఎస్‌లకు యూరిన్ కిట్లను పంపిణీ చేసినట్లు సమాచారం.

రేపు భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు రాష్ట్రంలో చలి తీవ్రరూపం దాల్చింది. సా.6 తర్వాత బయటికి రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు.