News July 18, 2024
మానవత్వమా.. నువ్వెక్కడున్నావ్?

అంబేడ్కర్ కోనసీమ & పల్నాడు జిల్లాల్లో జరిగిన రెండు ఘటనలు కాకుల్లో ఉన్న- మనుషుల్లో లేని ఐక్యతను నిరూపించాయి. తాటిపాక మార్కెట్లో కాకిని కట్టేస్తే వందల కాకులు వచ్చి అరుస్తూ తోటి జీవికి అండగా నిలిచాయి. అదే వినుకొండలో ఓ వ్యక్తిని కిరాతకంగా నరుకుతుంటే అక్కడున్నవారు చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఎవ్వరూ ధైర్యం చేసి జిలానీని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో మానవత్వం కనుమరుగైందని నెట్టింట విమర్శలొస్తున్నాయి.
Similar News
News November 17, 2025
ప్రియ జనులారా.. ఉచితమంటే ఎగబడకండి!

చాలా మందికి ఉచితం అనే సరికి ఎగబడటం పరిపాటైంది. దీనిమాటున ప్రమాదం పొంచి ఉన్నా గుర్తించట్లేదు. తాజాగా <<18309732>>iBOMMA<<>> విషయంలోనూ ఇదే రుజువైంది. ఉచితంగా సినిమా చూసే క్రమంలో తమకు తెలియకుండానే సమాచారాన్ని వారికి చేరవేశారు. ఈ క్రమంలో 50లక్షల మంది డేటా వారి చేతికి చిక్కిందని పోలీసులు వెల్లడించారు. దీంతో ఫ్రీగా వస్తుందనే సరికి ఆన్లైన్లో ముందూ వెనకా చూడకుండా వ్యవహరిస్తే ప్రమాదమని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పెరిగిన బంగారం ధరలు

ఇవాళ ఉదయం స్వల్పంగా <<18308959>>తగ్గిన<<>> బంగారం ధరలు సాయంత్రం పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రూ.320 పెరిగి రూ.1,25,400కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.300 ఎగిసి రూ.1,14,950గా నమోదైంది. వెండి ధరలో సాయంత్రం ఎలాంటి మార్పు జరగలేదు. కేజీ రూ.1,73,000గా ఉంది.