News September 23, 2024

మంత్రి సీతక్కతో నమ్రత

image

TG: సీఎం రేవంత్ నివాసంలో మంత్రి సీతక్కను సినీ హీరో మహేశ్ బాబు సతీమణి నమ్రత కలిశారు. మంత్రితో కాసేపు ముచ్చటించారు. మహేశ్ బాబు, నమ్రత ఇవాళ ఉదయం సీఎం రేవంత్‌ను కలిసి వరద బాధితుల కోసం రూ.60 లక్షల చెక్కును అందజేసిన సంగతి తెలిసిందే.

Similar News

News September 23, 2024

అదే జరిగితే 75% మంది UPI సేవల వినియోగాన్ని ఆపేస్తారు

image

UPI చెల్లింపులకు రుసుములు విధిస్తే మెజారిటీ యూజర్లు వాటి వినియోగాన్ని తగ్గించేస్తారని లోకల్‌ సర్కిల్స్ సర్వేలో తేలింది. లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తే 75 శాతం మంది UPI సేవల వాడకాన్ని వదిలేసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది డిజిటల్ చెల్లింపులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది. 38% యూజర్లు రోజులో సగం చెల్లింపులకు UPI వాడుతున్నారు. 10 మంది యూజర్లలో నలుగురు UPIకి ప్రాధాన్యమిస్తున్నారు.

News September 23, 2024

భారత్‌లో ఎంపాక్స్ క్లాడ్ 1బి స్ట్రెయిన్ నిర్ధారణ

image

కేర‌ళ‌లో గ‌త వారం ఎంపాక్స్ పాజిటివ్‌గా తేలిన‌ వ్య‌క్తిలో క్లాడ్ 1బి స్ట్రెయిన్ నిర్ధార‌ణ అయ్యింది. ఈ స్ట్రెయిన్ వ‌ల్లే డబ్ల్యూహెచ్‌ఓ గ‌త నెల‌లో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తిరిగి వచ్చిన కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 38 ఏళ్ల వ్యక్తిలో ఈ స్ట్రెయిన్‌ను గుర్తించారు. ప్ర‌స్తుతం రోగి ఆరోగ్య ప‌రిస్థితి స్థిరంగా ఉంద‌ని అధికారులు తెలిపారు.

News September 23, 2024

దోమలూ తెలివిమీరుతున్నాయి!

image

దోమలు చూడటానికి చిన్నగానే ఉండొచ్చు కానీ వాటికీ తెలివి ఉంటుంది. ఆ తెలివి ఈ మధ్య మరింతగా పెరిగిందంటున్నారు పరిశోధకులు. అవి రాకుండా కట్టే నెట్స్‌లోకి దూరేందుకు సైజ్ తగ్గించుకుంటున్నాయని, గుడ్లు పెట్టే సురక్షిత ప్రాంతాల గురించి ఒకదానికొకటి సమాచారం చెప్పుకొంటున్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. వాటిని చంపేందుకు ఉద్దేశించిన వివిధ రసాయనాలకు లొంగని నిరోధకతనూ అభివృద్ధి చేసుకుంటున్నాయని వెల్లడైంది.