News January 8, 2026

HURLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

హిందుస్థాన్ ఉర్వరిక్& రసాయన్ లిమిటెడ్ (<>HURL<<>>) 30 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 21 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, డిప్లొమా, MBA, MSW, పీజీ డిప్లొమా, MBBS, LLB ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్/స్క్రీనింగ్/సెలక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.hurl.net.in/

Similar News

News February 21, 2026

ప్రీ మెచ్యూర్ బేబీలకు ఈ సమస్యల ముప్పు

image

నెలలు నిండక ముందే పుట్టినవారు చాలా సున్నితంగా ఉంటారు. కంటికి రెప్పలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నారు నిపుణులు. ముందే పుట్టడం వల్ల వీరికి కంటి సమస్యలు, వినికిడి లోపం, శ్వాస, మెదడు సమస్యలు, గుండె జబ్బులు, నరాలు, జీర్ణశయాంతర సమస్యలు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలు వచ్చే ప్రమాదం ఎక్కువ. పుట్టినప్పుడు వారి అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు.

News February 21, 2026

ప్రీ మెచ్యూర్ బేబీల సంరక్షణ ఇలా..

image

ప్రీమెచ్యూర్ బేబీల సంరక్షణలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి పాలు పట్టడంతో పాటు బర్పింగ్ చేయించడం ముఖ్యం. సరైన నిద్ర కోసం అనువైన వాతావరణం సృష్టించాలి. వారికి రోజూ స్నానానికి బదులు స్పాంజ్ బాత్ చేయించాలి. వీరికి ఇన్ఫెక్షన్ల ముప్పూ ఎక్కువే. అలాగే వీరికి ఆరు నెలలు వచ్చేవరకు ప్రయాణాలు కూడా సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒక థర్మామీటర్‌, నెబ్యులైజర్‌ అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

News February 21, 2026

BREAKING: భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్

image

అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో భారత్‌కు పెద్ద ఊరట లభించింది. ట్రంప్ విధించిన అన్ని సుంకాలను కోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని దేశాలపై 10% టారిఫ్స్ విధిస్తూ ట్రంప్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారత్‌పై అంతకుముందు 18%గా ఉన్న టారిఫ్స్ ఇప్పుడు 10 శాతానికి(తాత్కాలికం) తగ్గాయి. దీనిని వైట్ హౌస్ అధికారులు ధ్రువీకరించారు.