News March 22, 2025
ఇన్‌స్టా లైవ్‌లో భర్త ఉరి.. వీడియో చూసినా పట్టించుకోని భార్య

మధ్యప్రదేశ్ రేవా(D)లో అమానవీయ ఘటన జరిగింది. భార్య, అత్త వేధింపులు తాళలేక శివ్ ప్రకాశ్(26) అనే యువకుడు ఇన్‌స్టా లైవ్‌లో ఉరివేసుకున్నాడు. అతని భార్య ప్రియాశర్మ 44 ని.లపాటు వీడియో చూస్తున్నా సాయం చేయడానికి ప్రయత్నించలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో భార్య, అత్తను పోలీసులు అరెస్టు చేశారు. ప్రియాశర్మకు ఉన్న వివాహేతర సంబంధం వల్లే భర్తతో విభేదాలు వచ్చాయని, ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు.
Similar News
News December 4, 2025
MHBD జిల్లాలో 9 గ్రామాలు ఏకగ్రీవం

MHBD జిల్లాలో 9మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లికుదురు(M) పార్వతమ్మగూడెం నుంచి పూలమ్మ, కేసముద్రం(M) చంద్రుతండా నుంచి శ్రీను, క్యాంపుతండా నుంచి కైక, నారాయణపురం నుంచి యమున ఏకగ్రీవమయ్యారు. ఇనుగుర్తి(M) పాతతండా నుంచి నరేష్, రాముతండా నుంచి మీటునాయక్, MHBD(M) సికింద్రాబాద్ తండా నుంచి నూనావత్ ఇస్తారి, రెడ్యాల నుంచి లక్ష్మి, గూడూరు(M) రాజన్‌పల్లి నుంచి మంగ సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు.
News December 4, 2025
179 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇంపాల్‌లో 179 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PhD, పీజీ, NET ఉత్తీర్ణతతో పాటు బోధన/ రీసెర్చ్‌లో అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.57,700 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://cau.ac.in/
News December 4, 2025
దీపం కొండెక్కింది అని ఎందుకు అంటారు?

దీపం ఆరిపోవడాన్ని మనం ‘దీపం కొండెక్కింది’ అని అంటాం. దీని వెనుక ఓ ఆధ్యాత్మిక కారణం ఉంది. సాధారణంగా మనం పర్వతాలను దైవ నివాసాలుగా భావిస్తాం. కొండలు దేవతలకు ఆశ్రయం ఇస్తాయని నమ్ముతాం. అయితే, దీపం జ్యోతి ఆరిపోయినప్పుడు, అది భౌతిక దేహాన్ని విడిచి, నేరుగా దైవంలో కలిసిపోయింది అని భావించాలి. దీపం దైవంలో ఐక్యమైందని చెప్పడానికే మనం ఆధ్యాత్మిక వ్యక్తీకరణను ఉపయోగిస్తూ ఇలా చెబుతుంటాం.


