News March 25, 2025

భార్య వీడియోలు షేర్ చేసే అర్హత భర్తకు లేదు: హైకోర్టు

image

భార్యతో సాన్నిహిత్యంగా గడిపిన వీడియోలను ఇతరులకు షేర్ చేసే అర్హత భర్తకు లేదని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇది భార్యాభర్తల మధ్య బంధాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. భార్యకు భర్త యజమాని కాదని, ఆమెకంటూ సొంత హక్కులు, కోరికలు ఉంటాయని తెలిపింది. తామిద్దరం కలిసున్న వీడియోలను తన భర్త వీడియో తీసి FBలో అప్‌లోడ్ చేయడంపై ఓ మహిళ పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Similar News

News January 24, 2026

బెంగాల్‌లో SIRపై నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ అసంతృప్తి

image

WBలో నిర్వహిస్తున్న SIRపై నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో హడావిడిగా చేస్తున్న ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందన్నారు. ‘ఓటర్ల జాబితాను సమీక్షించాలనుకోవడంలో తప్పులేదు. ప్రస్తుతం బెంగాల్‌లో జరగుతున్నది అలా లేదు. ఓటు హక్కు నిరూపించుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్‌ అందించడానికి తగిన సమయమివ్వాలి’ అని చెప్పారు.

News January 24, 2026

776 మంది కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు!

image

TG: ఇటీవల నియామక పత్రాలు అందుకున్న ల్యాబ్ టెక్నీషియన్లు విధుల్లో చేరారు. దీంతో ఆ స్థానాల్లో ఉన్న 776 మంది తాత్కాలిక(కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్) సిబ్బందిని తొలగించాలని ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లు ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ప్రభుత్వ వైద్య కాలేజీలు, ఆసుపత్రులలో వారి సేవలను నిలిపివేస్తున్నట్లు DME ప్రకటించారు. రెగ్యులర్ నియామకాలు పూర్తికావడంతో వీరిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.

News January 24, 2026

సెంటర్ సిల్క్ బోర్డ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>సెంటర్<<>> సిల్క్ బోర్డ్‌ 28 సైంటిస్ట్ -B పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. B.Tech/B.E. (టెక్స్‌టైల్ ఇంజినీరింగ్& ఫైబర్ సైన్స్)అర్హతగల వారు ఫిబ్రవరి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. GATE-2025 స్కోరు, ఇంటర్వ్యూ /పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.56,000-1,77,500. వెబ్‌సైట్: https://csb.gov.in/