News January 29, 2025

భార్య వేరొకరితో కన్న బిడ్డకూ భర్తే తండ్రి: సుప్రీంకోర్టు

image

భార్య మరొకరితో కన్న పిల్లలకూ భర్తే చట్టబద్ధంగా తండ్రి అవుతాడని సుప్రీంకోర్టు తెలిపింది. ఎవిడెన్స్ యాక్ట్‌లోని 112వ సెక్షన్ ఇలాగే ప్రెస్యూమ్ చేస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. భాగస్వాముల మధ్య నాన్ యాక్సెస్‌తోనే అక్రమ సంబంధాన్ని ఆరోపిస్తున్న వ్యక్తే నిరూపించాల్సి ఉంటుందంది. నిరూపణ కోసం DNA టెస్టులకు కోర్టులు అనుమతించొద్దని ఆదేశించింది. అక్రమ సంతానంపై కేరళ మాజీ దంపతుల కేసు విచారణలో ఇలా పేర్కొంది.

Similar News

News February 26, 2026

LOVE.. బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని సూసైడ్

image

బాసర RGUKTలో ECE <<19234623>>విద్యార్థిని <<>>వసంత(19) ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. వనపర్తి జిల్లా పానగల్ మండలానికి చెందిన వసంత, గణ్యానాయక్ ప్రేమించుకున్నారు. మంగళవారం పెళ్లి విషయమై వీరి మధ్య చర్చ జరగ్గా, చదువు తర్వాతే పెళ్లి చేసుకుంటానని ఆమె తెలిపింది. దీంతో మనస్తాపం చెందిన గణ్యానాయక్ ఉరేసుకున్నాడు. ఆ విషయం తెలిసి భయపడిన వసంత, చేతులు, గొంతు కోసుకొని ఉరేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

News February 26, 2026

‘కాళేశ్వరం’ రుణాలు.. తగ్గిన వడ్డీ భారం

image

TG: కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు గతంలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ₹71,566Cr రుణం విడుదలైంది. వార్షిక వడ్డీ 9.45-10.90%. ఇప్పటికే కొంత చెల్లించగా ఇంకా ₹68,273Cr బాకీ ఉంది. వడ్డీని 7.5 శాతానికి తగ్గించడానికి కేంద్రం అంగీకరించడంతో ఒకేసారి ₹33,574Crను ప్రభుత్వం చెల్లించింది. మిగతా మొత్తాన్ని దీర్ఘకాలిక వాయిదాల కింద చెల్లిస్తామని తెలిపింది.

News February 26, 2026

శ్రీవారికి నగదే కాదు ‘ముడుపు పత్రాలు’ సమర్పించవచ్చు!

image

AP: తిరుమలలో భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు కొత్త విధానాన్ని TTD అమలు చేయనుంది. త్వరలో ‘శ్రీవారి ముడుపు పత్రం’ పేరుతో ప్రత్యేక పత్రాలను జారీ చేయనుంది. ₹100 నుంచి ₹లక్ష వరకు UPI, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసి హుండీలో సమర్పించవచ్చు. క్యాష్‌లెస్ లావాదేవీలు పెరిగిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి జరిగే TTD బోర్డు మీటింగ్‌లో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.