News November 6, 2024
ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నటి భర్త
నటి స్వర భాస్కర్ భర్త ఫాహద్ అహ్మద్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ముంబైలోని అనుశక్తి నగర్ నుంచి ఆయన NCP-SP తరఫున పోటీ చేస్తున్నారు. గతంలో సమాజ్వాదీ పార్టీలో ఉన్న ఆయన ఇటీవలే NCP-SPలో చేరారు. ఎన్నికల్లో ప్రచారం కోసం తన భర్త క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేసినట్లు స్వర ట్వీట్ చేశారు. అతడికి మద్దతుగా నిలిచి విరాళాలు అందించాలని అభ్యర్థించారు. గతేడాది అహ్మద్ను స్వర పెళ్లి చేసుకున్నారు.
Similar News
News November 6, 2024
త్వరలో వరంగల్ మాస్టర్ ప్లాన్ విడుదల
TG: 2050 నాటి జనాభాను దృష్టిలో పెట్టుకుని వరంగల్ మాస్టర్ ప్లాన్ను రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. త్వరలోనే సీఎం రేవంత్ చేతుల మీదుగా విడుదల చేయనుంది. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లకు అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు సూచించింది. ఏడాదిలోపు మామునూరు ఎయిర్పోర్టు అందుబాటులోకి తీసుకొచ్చేలా, కార్గో సేవలూ అందించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది.
News November 6, 2024
అకౌంట్లోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
AP: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను కాలేజీల ఖాతాల్లోకే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీలకే చెల్లించే ఫైలుపై ఇవాళ క్యాబినెట్ సమావేశంలో చర్చించి, ఆమోదించనుంది. ప్రస్తుత విధానంతో కాలేజీలు విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి చేయడంతో కొందరు పరీక్షలు కూడా రాయలేని పరిస్థితి నెలకొందని ప్రభుత్వం దృష్టికి రావడంతో కాలేజీలకే చెల్లించాలని చూస్తోంది.
News November 6, 2024
రామగుండంలో రూ.29,345 కోట్లతో పవర్ ప్రాజెక్టు
TG: రామగుండంలో NTPC ఆధ్వర్యంలో సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. 2400(3*800) మెగావాట్ల సామర్థ్యంతో రూ.29,345 కోట్లతో దీనిని నిర్మించేందుకు NTPC బోర్డు ఆమోదం తెలిపింది. తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో 6400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో రూ.80,000 కోట్లతో ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి.