News January 28, 2025
హుస్సేన్ సాగర్ ఘటన: రెండుకు చేరిన మరణాలు

TG: రిపబ్లిక్ డే రోజున హుస్సేన్ సాగర్లో బోట్లు దగ్ధమైన ఘటనలో గల్లంతైన అజయ్ మృతదేహం లభించింది. రెండు రోజుల గాలింపు తర్వాత డీఆర్ఎఫ్ బృందాలు మృతదేహాన్ని వెలికితీశాయి. అజయ్ అచూకీ తెలియడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. అంతకుముందు ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణపతి మరణించాడు.
Similar News
News December 6, 2025
ఇండిగో సంక్షోభం వేళ రైల్వే కీలక నిర్ణయం

ఇండిగో ఫ్లైట్స్ రద్దు కారణంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 37 రైళ్లకు 116 అదనపు కోచ్లు అనుసంధానించినట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దక్షిణ రైల్వేలో 18 రైళ్లకు అత్యధికంగా కోచ్లు పెంచారు. ఉత్తర, పశ్చిమ, తూర్పు, ఈశాన్య రైల్వే జోన్లలో కూడా స్పెషల్ కోచ్లు ఏర్పాటు చేశారు. అదనంగా 4 ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నారు.
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


