News July 5, 2024
HWO పరీక్షకు 56.92 శాతం మంది హాజరు

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ (HWO) పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు TGPSC అధికారులు పేర్కొన్నారు. పేపర్-1కు 56.94% మంది, పేపర్-2కు 56.04% మంది హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే రెస్పాన్స్ షీట్స్ విడుదల చేస్తామన్నారు. పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో జూన్ 24 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.
Similar News
News November 20, 2025
బంజారాహిల్స్ రోడ్డు విస్తరణపై హైకోర్టు ఆదేశం

బంజారాహిల్స్ విరించి ఆస్పత్రి నుంచి అగ్రసేన్ జంక్షన్ వరకు రోడ్డు విస్తరణకు జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు మద్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. భూసేకరణ చట్టం నిబంధనలను పాటించకుండా జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ విక్రమ్ దేవ్‌తో సహా 20 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
News November 20, 2025
మాజీ సైనికులకు గుడ్ న్యూస్.. 28న జాబ్ మేళా

సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ సైనికోద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ నెల 28వ తేదీన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు ఈ మేళా ఉంటుందన్నారు. వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారి హరినాయక్ తెలిపారు. ఆసక్తిగల వారు www.dgrindia.gov.inలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
News November 20, 2025
మరోసారి అతిరథ మహారథులతో మెరిసిపోనున్న నగరం

భారతీయ కళా మహోత్సవం సెకండ్ ఎడిషన్‌కు రాష్ట్రపతి నిలయం వేదికకానుంది. 22- 30వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ మహోత్సవ్‌లో పశ్చిమ రాష్ట్రాలైన మహరాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, గోవాలతో పాటు డామన్& డయ్యూ, దాద్రానగర్ హవేలీకి చెందిన ప్రదర్శనలు ఉంటాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కళాకారులు HYD రానున్నారు. కాగా, రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు.


