News July 21, 2024

HYD:‘ఉద్యమకారులకిచ్చిన హామీలు అమలు చేయాలి’

image

ఈనెల 23 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం విజ్ఞప్తి చేసింది. ఫోరం రాష్ట్ర ఛైర్మన్ చీమ శ్రీనివాస్ బషీర్‌బాగ్‌లో మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలన్నారు.

Similar News

News December 12, 2024

HYD: కుమ్మరిగూడలో కొలువుదీరిన ముత్యాలమ్మ

image

సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ఠ బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు. గుడిపై దాడి అనంతరం సికింద్రాబాద్‌లో తీవ్ర ఘర్షణ నెలకొంది. ప్రభుత్వం, ప్రతిపక్షాలు సైతం నివ్వెరపోయాయి. దాడిని తీవ్రంగా ఖండించాయి. యుద్ధప్రాతిపదికన నిధులు విడుదల చేసిన సర్కార్ అమ్మవారిని కొలువుదీర్చారు. భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News December 12, 2024

HYD: ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

image

నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందని, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

News December 11, 2024

HYD: DEC-17 నుంచి రాష్ట్రపతి శీతాకాల విడిది

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది నేపథ్యంలో హైదరాబాద్ రానున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం సూచించారు. ఈ నెల 17 నుంచి 21 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బస చేయనున్నారని కలెక్టర్ తెలిపారు. దీనిపై అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో పాటు పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.