News October 18, 2024
HYD:కమిషనర్ ఇలంబర్తికి శుభాకాంక్షలు వెల్లువ
HYD జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఇలంబర్తికి జోనల్ కమిషనర్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రోగ్రాంలో ఎల్బీనగర్ జోన్ ZC హేమంత పటేల్, ఖైరతాబాద్ ZC అనురాగ్ జయంతి, శేర్లింగంపల్లి ZC ఉపేందర్ రెడ్డి, సికింద్రాబాద్ ZC రవికిరణ్, చార్మినార్ ZC వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 13, 2024
HYD: బైకులు ఎత్తుకుపోతున్నారు జాగ్రత్త..!
HYDలో 2024లోనే దాదాపు 1,400లకు పైగా వాహనాల చోరీ జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. గతేడాది మొత్తం 1,400 చోరీల కేసులు నమోదైతే ఈ ఏడాది ఇప్పటికే 1,400 దాటడం గమనార్హం. ముఖ్యంగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో, ఇంటి ముందు పార్కు చేసినవి, కొన్నేళ్లుగా మూలకు పడి ఉన్న వాహనాలను ఎత్తకెళ్తున్నారు. అయితే బైకులకు అలారమ్, సెన్సార్లు ఏర్పాటు చేసుకోవడం మేలని అధికారులు సూచిస్తున్నారు.
# SHARE IT
News November 13, 2024
HYD: మూసీపై MASTER ప్లానింగ్, డిజైన్లపై కసరత్తు!
HYD మూసీకి తూర్పున గౌరెల్లి నుంచి పశ్చిమాన నార్సింగి వరకు 55KM మేర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. నదికి ఇరువైపుల కిలోమీటర్ మేర గ్రోత్ ఏరియాగా గుర్తించారు. మొత్తంగా 125 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాణిజ్య కేంద్రాలు, రవాణా, లాజిస్టిక్ పార్కులు, గ్రీన్ జోన్ లాంటివి ఏర్పాటు చేయనున్నారు. మరో నెలలో మూసీ డిజైన్లు పూర్తవుతాయని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
News November 12, 2024
HYD:ఇంటర్నేషనల్ లైసెన్సుల పై వాహనదారుల ఆసక్తి!
అంతర్జాతీయ లైసెన్సులపై వాహనదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. గ్రేటర్ HYD పరిధిలో ఈ ఏడాది ఏకంగా 10,000 వరకు జారీ అయినట్లు అధికారులు తెలిపారు. వీటి కోసం ఆర్టీఏ వెబ్‌సైట్, లేదంటే స్థానికంగా ఉన్న కార్యాలయం వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కనీసం 18 ఏళ్ల వయసు ఉండాలని, దరఖాస్తు చేసిన తేదీ నుంచి కనీసం 6 నెలల పాటు చెల్లుబాటు అయ్యేలా పాస్ పోర్ట్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.