News August 7, 2024

HYDకు తీరనున్న తాగునీటి కొరత

image

గ్రేటర్ హైదరాబాద్‌కు తాగునీటి కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-2కు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్లన్న సాగర్ నుంచి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌కు గోదావరి జలాలని తరలించి ఆయా ప్రాజెక్టులని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.5,560 కోట్లు కేటాయించి ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News November 12, 2024

HYD: 15 వేల మంది విద్యార్థులతో ప్రోగ్రాం: సీఎం

image

HYDలో నవంబర్ 14న చిల్డ్రన్స్ డే రోజు దాదాపుగా 15,000 మంది విద్యార్థులతో భారీ ఈవెంట్ నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ గురుకులాల ప్రాజెక్టును ప్రకటించడంతో పాటు, పూర్తి వివరాలు వివరించనున్నట్లు సెక్రటేరియట్లో పేర్కొన్నారు. 20-25 ఎకరాల్లో 2,500 మంది విద్యార్థుల కెపాసిటీతో గురుకులాలను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

News November 12, 2024

HYD: ఎలక్ట్రిక్ బస్సులు పెంచడంపై ఆర్టీసీ ఫోకస్

image

గ్రేటర్ HYD జోన్ పరిధిలో ఆర్టీసీ 2,800 బస్సులు నడుపుతుండగా వాటిలో 40 పుష్పక్ బస్సులతో కలిపి దాదాపు 115 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. రాబోయే రెండేళ్లలో భారీగా ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపై ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి కొన్ని అందుబాటులోకి తేనుంది. కోకాపేట, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్ డిపోల ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది.

News November 12, 2024

సికింద్రాబాద్: రైల్వే స్టేషన్లలో రద్దీ.. ఎప్పటికప్పుడు చర్యలు!

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే ప్రొటెక్షన్ పోలీసుల బృందం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుంది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్ వద్ద తగిన భద్రతను ఏర్పాటు చేశారు. ఛట్ పూజ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా రద్దీ పెరుగుతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు డౌన్ ట్రాఫిక్ చర్యలు చేపడుతున్నారు.