News November 20, 2024
HYDకు రాష్ట్రపతి.. మాదాపూర్‌లో డ్రోన్‌లు నిషేధం

ఈ నెల 21, 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము HYDలో పర్యటిస్తారు. 22న హైటెక్‌సిటీ శిల్పకళా వేదికలో లోక్ మంతన్-2024 కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రెసిడెంట్ టూర్ నేపథ్యంలో CYB పోలీసులు అప్రమత్తమయ్యారు. మాదాపూర్ PS పరిధిలో డ్రోన్లు ఎగరేయడాన్ని నిషేధించారు.ఈ ఆదేశాలు నవంబర్ 22 వరకు అమల్లో ఉంటాయన్నారు. పోలీసుల ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ CP అవినాష్ మహంతి హెచ్చరించారు. SHARE IT
Similar News
News March 7, 2026
HYD: మేడం సార్.. మేడం అంతే!

షాద్‌నగర్‌కి చెందిన ఇంద్రార్చిత కర్ణాటక క్యాడర్‌లో సివిల్స్‌లో 627వ ర్యాంకు సాధించి సత్తాచాటారు. ఆమె ప్రాథమికోన్నత విద్య షాద్‌నగర్‌లో పూర్తిచేశారు. HYDలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఆఫ్ ఉమెన్‌లో ఇంటర్, డిగ్రీ వరకు చదివారు. అనంతరం ఇగ్నో యూనివర్సిటీలో MA పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి.. ఢిల్లీకి వెళ్లి కోచింగ్ తీసుకొని సివిల్స్‌కు సిద్ధమయ్యారు. నిన్న విడుదలైన ఫలితాల్లో ‘మేడం’ గ్రేట్ అనిపించుకున్నారు.
News March 7, 2026
VFX హబ్‌గా HYD.. ప్రారంభించనున్న సీఎం

ప్రముఖ OTT సంస్థ నెట్ ఫ్లిక్స్ తన కార్యాలయాన్ని హైదరాబాదHలో ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఈ నెల 12న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు దీనిని ప్రారంభించనున్నారు. 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ స్టూడియోను ప్రారంభించనుంది. భారతదేశంలో తనకు రెండో కార్యాలయం కానుంది. దీని ద్వారా VFX, గేమింగ్ కామిక్స్ రంగంతో పాటు వివిధ రంగాలలో మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని చెబుతున్నారు.
News March 7, 2026
HYDలో DANGER కంటి‘న్యూస్’

నగరంలో గాలి నాణ్యత పడిపోతుండటంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా రెండంకెల స్థాయిలో ఉండాల్సిన గాలి నాణ్యత సూచీ శనివారం బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో అత్యధికంగా 248గా నమోదైంది. వాహనాల పొగ, చెత్తాచెదారం తగలబెట్టడం కారణంగా కాలుష్య స్థాయిలు పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ప్రజలు మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.


