News January 4, 2025

HYDకు వచ్చే మంచినీరు ఈ నదుల నుంచే..!

image

నగరానికి ప్రస్తుతం మంజీరా, సింగూరు, గోదావరి, కృష్ణా నుంచి నీటి సరఫరా జరుగుతోందని జలమండలి తెలిపింది. గోదావరి ఫేజ్-2 ద్వారా మరిన్ని నీటిని తరలించి ఉస్మాన్‌సాగ‌ర్‌, హిమాయత్‌సాగర్ వరకు తాగునీటి సరఫరాకు డిజైన్ చేసిన ప్రాజెక్టు రూపు దిద్దుకుంటుందని పేర్కొంది. మరోవైపు జలమండలి నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు ఆదాయం పెంచడంపై దృష్టి సారించనుంది.

Similar News

News January 14, 2025

HYD: నేడే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

image

AICC నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొననున్నారు. రేపు, ఎల్లుండి ఢిల్లీలోనే సీఎం, మంత్రులు బస చేయనున్నారు. ఢిల్లీ నుంచే వారం రోజుల పాటు సింగపూర్, దావోస్ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులతో పర్యటించనున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా వెళ్లనున్నారు.

News January 14, 2025

HYDలో గణనీయంగా తగ్గిన విద్యుత్ వాడకం

image

సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులు పల్లెటూర్లకు తరలివెళ్లారు. దీంతో గృహాలతో పాటు కార్యాలయాల్లో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పడిపోయింది. ఉత్పత్తులు, రోజువారి కార్యకలాపాలు నిలిచిపోవడంతో వినియోగం గణనీయంగా తగ్గింది. సోమవారం 2,500 మెగావాట్లకు పడిపోయింది. సాధారణ రోజులతో పోలిస్తే 700 మెగావాట్ల విద్యుత్ వినియోగం తగ్గిందని అధికారలు తెలిపారు.

News January 14, 2025

HYD: అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణం: హరీశ్

image

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోకాపేటలోని తన నివాసంలో మాట్లాడుతూ.. బెయిలబుల్ సెక్షన్స్‌లో అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణం అన్నారు. పండగపూట డెకాయిట్‌ని, టెర్రరిస్ట్‌ని అరెస్టు చేసినట్లు పెద్ద సంఖ్యలో పోలీసులు వెళ్లి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.