News January 31, 2025
HYDను గ్లోబల్ సిటీగా మార్చే మైలురాయి అదే!: మేయర్

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ నుంచి తెచ్చిన రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు, HYD నగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చే మైలురాయిగా GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి అభివర్ణించారు. ఈ పెట్టబడుల ద్వారా 49,500 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని పేర్కొన్నారు. గతం కంటే మించిన పెట్టుబడులు రావటం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.
Similar News
News February 18, 2025
మనూ భాకర్‌కు బీబీసీ పురస్కారం

భారత స్టార్ షూటర్ మనూ భాకర్‌కు ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం దక్కింది. పారిస్ ఒలింపిక్స్‌లో ప్రదర్శనకు గాను ఆమెకు ఈ అవార్డు లభించింది. క్రికెటర్ స్మృతి మంథాన, రెజ్లర్ వినేశ్ ఫొగట్, గోల్ఫర్ అదితీ అశోక్, పారా షూటర్ అవనీ లేఖరా పేర్లు నామినేషన్లో ఉండగా భాకర్‌నే పురస్కారం వరించడం విశేషం. పారిస్ ఒలింపిక్స్ షూటింగ్‌లో మనూ రెండు కాంస్య పతకాల్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే.
News February 18, 2025
ఎల్లారెడ్డిపేట: విషాదం.. వ్యక్తి ఆత్మహత్య

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రమాకాంత్ తెలిపిన వివరాలు.. హనుమ కనకయ్య(40) అప్పుల బాధతో మద్యానికి బానిస అయ్యాడు. సోమవారం ఉదయం అతడి బెడ్రూమ్‌లో ఉరేసుకుని చనిపోయినట్లు అతడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
News February 18, 2025
మాస్ కాపీయింగ్‌పై నిర్మల్ కలెక్టర్‌కు ఫిర్యాదు

ఇటీవల జరిగిన ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ జరిగిందని ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామస్థులు సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లావ్యాప్తంగా జరిగిన ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లో కేవలం భైంసా పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసిన 61 మంది విద్యార్థులకు మెరిట్ వచ్చిందన్నారు. మాస్ కాపీయింగ్‌పై తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని దీనిపై విచారణ జరపాలని కోరారు.