News March 13, 2025

HYDను దేశ 2వ రాజధాని చేయాలని డిమాండ్

image

పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుందని VCK రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ఆరోపించారు. ఆయన అధ్యక్షతన బుధవారం బాగ్‌లింగంపల్లిలోని SVKలో ‘దక్షిణాది పార్లమెంటు సీట్లు పెంపు-దక్షిణాది హక్కు’ పై వివిధ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దక్షిణాదికి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని, HYDను దేశానికి 2వ రాజధానిగా చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News February 10, 2026

HYD: 10th విద్యార్థినికి తాళి కట్టిన సార్

image

10వ తరగతి విద్యార్థినికి ఓ టీచర్ తాళి కట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచేసింది. ఘట్కేసర్ పరిధి పోచారంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌ టీచర్ మైటీన్(27) విద్యార్థినికి మాయమాటలు చెప్పి చాటుగా తాళి కట్టాడు. JAN 3 గమనించిన తల్లి, కుమార్తెను నిలదీయగా విషయం చెప్పింది. ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లగా.. స్కూల్‌కి సంబంధం లేదనటంతో బాధితులు పోచారం PSలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు.

News February 10, 2026

HYD: నిరసనలు.. ఆందోళనలతో గడిచిపోయింది!

image

నేటితో ముగియనున్న GHMC పాలక మండలి.. నిరసనలు, ఆందోళనలతోనే గడిచిపోయింది. ఐదేళ్ల పదవీ కాలంలో పాలకమండలి 23సార్లు సమావేశమైంది. ఏడాదికి సరాసరి 4.6 సార్లు జరిగినట్లు లెక్క. ఈ సమావేశాలు జరుగుతున్నపుడు ప్రతిపక్ష పార్టీల సభ్యుల ఆందోళనలు, నిరసనలు హోరెత్తాయి. దీంతో సగం సమావేశాలు వాటితోనే ముగిశాయి. ఈ 5ఏళ్లలో 415 తీర్మానాలను పాలకమండలి ఆమోదించింది.

News February 10, 2026

HYD: చనిపోయినా పెన్షన్ ఇస్తాం.. వాడుకోండి

image

‘అయ్యో! మీరు చనిపోయారా.. ఏం పర్లేదు మీ పెన్షన్ డబ్బులు ఆగిపోవు.. మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. మీరు ఏ లోకంలో ఉన్నా వాడుకోవచ్చు’ ఇది సర్కారు తీరు. ఫతుల్లాగూడకు చెందిన జంగయ్య, బండ్లగూడకు చెందిన పోచయ్యలు ఎప్పుడో చనిపోయారు. అయినా వారి అకౌంట్లలో వృద్ధాప్య పెన్షన్ పడుతోంది. త్యాయగరాయనగర్‌కు చెందిన వీరభద్రయ్య(దివ్యాంగుడు) చనిపోయినా 5ఏళ్లుగా నెలకు రూ.4,016 జమ అవుతోందంటే మన అధికారుల తీరు అర్థం చేసుకోవచ్చు.