News March 25, 2025

HYDలోని రోడ్డు ప్రమాదం.. KTDM యువకుడు మృతి

image

దమ్మపేట మండలంలోని సున్నంబట్టి గ్రామానికి చెందిన బంటు రాజ్ కుమార్ హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రాజ్‌కుమార్ HYDలోని ప్రైవేట్ కాలేజీలె బీటెక్ ఫస్ట్ ఈయర్ చదువుతున్నాడు. ఆదివారం తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదంశాత్తు డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు..

Similar News

News January 10, 2026

పుతిన్‌నూ అదుపులోకి తీసుకుంటారా?.. ట్రంప్ సమాధానమిదే!

image

వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురోను <<18751661>>అదుపులోకి<<>> తీసుకుని అమెరికా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అలానే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కూడా పట్టుకోవాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ట్రంప్ ‘అలా చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా’ అని బదులిచ్చారు. పుతిన్‌తో తనకు మంచి రిలేషన్ ఉందని చెప్పారు. కానీ ఆయన విషయంలో నిరాశకు గురయ్యానని అన్నారు.

News January 10, 2026

పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్‌లో 17న తుక్కు వేలం

image

విశాఖలో పోలీస్ స్టేషన్లు, విభాగాలు నుంచి సేకరించిన నిరుపయోగమైన ఇనుము, అల్యూమినియం, చెక్క, ప్లాస్టిక్ వస్తువులు జనవరి 17న వేలం వేయనున్నట్లు విశాఖ సీపీ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. ఆరోజు ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం వేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు జనవరి 12 ఉదయం 10 నుంచి వస్తువులను చూసుకొనవచ్చన్నారు. వేలంలో పాల్గొనే వారు పోలీస్ బ్యారెక్స్, కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకోవాలన్నారు.

News January 10, 2026

48 డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో 48 కార్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. అహ్మదాబాద్‌ ప్రాంతంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్ పాసై, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు జనవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18నుంచి 27ఏళ్లు మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌ల్ సడలింపు ఉంది. నెలకు జీతం రూ.19,900-63,200 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.indiapost.gov.in/