News March 16, 2026
HYDలో అంతా మా ఇష్టం!

HYDలో గ్యాస్ కొరత వార్తలు సామాన్య ప్రజల పాలిట శాపంగా మారింది. బషీర్‌బాగ్‌లోని ఫుల్‌బాగ్ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ్యాస్ ధరలు పెరిగాయనే నెపంతో ప్రతి ఫుడ్ ఐటమ్ మీద అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారు. ఇష్టానుసారంగా పెంచుతోన్న ధరలతో సామాన్య ప్రజలు వాపోతున్నారు. కట్టడి చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News April 13, 2026
HYD: కన్నీటి కడలిలో ఎదురీదిన సృజన

రాజేంద్రనగర్ మండలం పద్మశాలిపురం బస్తీకి చెందిన గుంటి సృజన కష్టాల మధ్య అద్భుతం చేసి చూపింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న తండ్రిని ఆస్పత్రిలో చూసుకుంటూనే ఇంటర్ పరీక్షలకు హాజరైంది. కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉన్నా ఆమె ధైర్యం కోల్పోలేదు. బైపీసీలో 440 మార్కులకు 427 మార్కులు సాధించి తండ్రి ముఖంలో వెలుగు నింపాలనుకుంది. కానీ ఈ లోపే తండ్రి కాలంచేయడంతో మార్కులు చూసుకుంటూ తండ్రిని తలచుకుని కన్నీరు పెట్టుకుంది.
News April 13, 2026
HYD: IPL మ్యాచ్..ట్రాఫిక్ డైవర్షన్ రూట్లు ఇవే..!

✓ఘట్కేసర్- చెంగిచెర్ల- బోడుప్పల్- పిర్జాదిగూడ- ఉప్పల్ HMDA భగాయత్- నాగోల్-ఎల్బీనగర్
✓తార్నాక నుంచి ఎల్బీనగర్, ఘట్కేసర్ వెళ్లే వాహనాలు హబ్సిగూడ క్రాస్ రోడ్డు నుంచి నాచారం NFC సర్కిల్, IOCL చర్లపల్లి, చెంగిచెర్ల, బోడుప్పల్, నాగోల్, ఎల్బీనగర్
✓ఎల్బీనగర్ నుంచి ఘట్కేసర్ వెళ్లే వాహనాలు నాగోల్ మెట్రో యూటర్న్, HMDA భగాయత్, టయోటా యూటర్న్, బోడుప్పల్, ఘట్కేసర్.
News April 13, 2026
పబ్లిక్ గార్డెన్‌లో రేపు అంబేడ్కర్ సినిమా ప్రదర్శన

నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో రేపు (మంగళవారం) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బయోపిక్ ప్రదర్శించనున్నారు. తెలుగు లలితకళా తోరణంలో ఈ ప్రదర్శన ఉంటుంది. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ సినిమా ప్రదర్శన ఉంటుందని సాంస్కతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


