News April 2, 2025
HYDలో అందమైన ప్రదేశాలు చూపిస్తానని అత్యాచారం

జర్మనీ యువతిపై అత్యాచారం కేసులో CP ఆదేశాలతో మహేశ్వరం DCP సునీత సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. సోమవారం సా. 6 గంటలకు యువతి, ఆమె స్నేహితుడిని అస్లాం కారులో ఎక్కించుకుని యాకుత్పురా, చార్మినార్లో తిప్పాడు. సిటీ శివారులో అందమైన ప్రదేశాలు చూపిస్తాను అంటూ పహడీషరీఫ్ తీసుకెళ్లాడు. యువతి ఫ్రెండ్ను కారు దింపి యూటర్న్ చేస్తాను అని నమ్మించాడు. కొద్దిదూరం తీసుకెళ్లి <<15963281>>ఆమెపై<<>> అత్యాచారం చేశాడు ప్రబుద్ధుడు.
Similar News
News October 24, 2025
BREAKING.. వంగర గురుకులంలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

ఉరేసుకొని టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పీవీ గురుకులంలో చోటు చేసుకుంది. కాగా, పండుగ సెలవులకు ఇంటికి వెళ్లి.. శుక్రవారం తిరిగి స్కూలుకు వచ్చినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News October 24, 2025
ఎంపీ vs ఎమ్మెల్యే.. కారణం ఇదేనా?

AP: విజయవాడ MP చిన్ని, తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదం ముదురుతోంది. కొలికపూడి గెలుపు కోసం ₹18 కోట్లు ఖర్చు చేశానని, వచ్చే ఎన్నికల్లో TDP నేత జవహర్ కొడుకు పోటీ చేస్తారని చిన్ని చెప్పడమే గొడవకు కారణమని తెలుస్తోంది. ఆత్మగౌరవానికి భంగం కలగడంతోనే <<18082832>>ఇలా మాట్లాడాల్సి<<>> వస్తోందని MLA చెప్తున్నారు. 12 నెలలుగా దేవుడని, ఇప్పుడు దెయ్యమని ఎందుకంటున్నారో చెప్పాలని చిన్ని ప్రశ్నిస్తున్నారు.
News October 24, 2025
తిరుపతి గ్రేటర్ ప్రతిపాదనకు చెక్ పెడుతున్నారా…?

తిరుపతి గ్రేటర్ ప్రతిపాదన ఇవాళ కౌన్సిల్లో కీలకం కానుంది. CM చంద్రబాబు వైజాగ్, విజయవాడ తరహాలో తిరుపతిని డెవలప్ చేయాలని సంకల్పించి, రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు మండలాల 69 పంచాయతీలను విలీనంచేసే ప్రణాళికను ముందుకు తీసుకొచ్చారు. మేయర్ సుముఖంగా ఉన్నప్పటికీ, కొందరు MLAలు అభ్యంతరం వ్యక్తంచేయడంతో ప్రక్రియ వాయిదాపడే అవకాశముంది. గ్రేటర్ లేకుండా తిరుపతి అభివృద్ధి సాధ్యం కాదని ఆఫీసర్లు పేర్కొంటున్నారు.


