News March 21, 2025

HYDలో అడవిని సృష్టించలేం.. కానీ..!

image

మన HYDలో అడవిని సృష్టించలేము. కానీ, ప్రయత్నం చేద్దాం. ‘రాజధాని’ కాంక్రిట్ జంగిల్‌‌గా మారడంతో గల్లీ గల్లీకి సీసీ రోడ్డు వస్తున్నాయే తప్పా.. ఓ మొక్క నాటడానికి జాగ దొరుక్తలేదు. హరితహారం, వన మహోత్సవం అంటూ ప్రభుత్వాలు గొప్ప పనే చేస్తున్నాయి. కానీ, సామాజిక బాధ్యతగా చెట్లను రక్షించాల్సిన మనం ఏం చేస్తున్నాం? అసలే ఎండకాలం. నీడనిచ్చే చెట్లను కాపాడుకుందాం.
నేడు ప్రపంచ అటవీ దినోత్సవం.
SAVE TREES.

Similar News

News September 13, 2025

రంగారెడ్డి: ఈనెల 15న జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక

image

రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ కబడ్డీ బాల, బాలికల జట్ల ఎంపిక ఈ నెల 15న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరగనుంది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ.. ఎంపికైన క్రీడాకారులు నిజామాబాద్ జిల్లాలో జరిగే అంతర్ జిల్లా కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. 55 కిలోల బరువు లోపు ఉన్న క్రీడాకారులు మాత్రమే ఈ ఎంపికకు అర్హులని పేర్కొన్నారు.

News September 13, 2025

‘గాంధీ ఆసుపత్రిని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా’

image

గాంధీ ఆసుపత్రిని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని నూతన సూపరింటెండెంట్ డాక్టర్ వాణి అన్నారు. శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. ఆసుపత్రిలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని పూర్తిగా పరిశీలించి, పరిస్థితులను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

News September 13, 2025

దిల్‌సుఖ్‌నగర్: ఆర్టీసీ ‘యాత్రాదానం’

image

టీజీఎస్ఆర్టీసీ ‘యాత్రాదానం’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిందని హైదరాబాద్-2 డిపో మేనేజర్ కృష్ణమూర్తి తెలిపారు. అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులకు పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు ఉచిత యాత్రలు కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమానికి దాతలు, కార్పొరేట్ సంస్థలు, ప్రజాప్రతినిధులు విరాళాలు అందించి భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.