News July 13, 2024

HYDలో ‘అమ్మ మాట..అంగన్వాడి బాట’

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఇక ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంగన్వాడి కేంద్రాల్లోనే జరగనుంది. జూలై 15 నుంచి 20 వరకు ‘అమ్మ మాట అంగన్వాడి బాట’ పేరిట ప్రత్యేక ప్రోగ్రాం జరగనుంది. ప్రస్తుతం రెండున్నర ఏళ్ల పిల్లలు పాఠశాలల్లో చేరే నాటికి అక్షరాలు, అంకెలు, ఆట పాటలతో కూడిన విద్య అందించడమే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లక్ష్యంగా జిల్లాల అధికారులు తెలిపారు.

Similar News

News December 15, 2025

HYD: ఫేమస్ బుక్స్.. షార్ట్ రివ్యూస్!

image

ఈనెల 19నుంచి NTRస్టేడియంలో బుక్ ఫెయిర్ ఉంది. ఏబుక్స్ కొనాలని యోచిస్తుంటే? మీకోసమే.
➥ఫ్రెడ్రిక్ నిషే ఫిలాసఫీ ‘మనిషి ఒంటేలాంటోండు..మోకరిల్లి బాధ్యతల బరువును భుజానేసుకొని జీవితం భారమైందని ఏడుస్తాడు’అని చెప్పింది ఈయనే. మనిషి సూపర్‌మ్యాన్ కాగలడని ఏకాంతంగా గడిపిన ‘జరతూస్త్రా’తో ప్రపంచానికి చెప్పారు. మనిషి బానిస గోడలను బద్దలుకొట్టే ఆలోచనలు పుట్టిస్తారు. నిషేను మరోలా అర్థం చేసుకుని హిట్లర్ WW ప్రకటించారు.

News December 15, 2025

HYD: న్యూ ఇయర్ కోసం వెయిటింగా? మీకోసమే

image

HYD న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. DEC 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1 వరకు పబ్‌లు, బార్‌లు, హోటళ్లలో CCకెమెరాలు, సెక్యూరిటీ తప్పనిసరి. మైనర్లకు ఎంట్రీ, మద్యం నిషేధం, డీజేలు, అశ్లీల నృత్యాలు, రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బ్యాన్. మద్యం తాగి వాహనం నడిపితే కేసులు, జరిమానా, జైలు శిక్ష విధిస్తామని CP సజ్జనార్ హెచ్చరించారు. న్యూ ఇయర్ ఈవెంట్లు రాత్రి 12:30లోపు ముగించాలన్నారు.

News December 15, 2025

ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా జాగ్రత్తలు తీసుకోండి: కిషన్‌ రెడ్డి

image

ఫిలింనగర్‌లో పర్వతాంజనేయ స్వామి ఆలయాన్ని ఆనుకొని భూములు అన్యాక్రాంతం అయ్యాయని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఆలయం చుట్టూ ప్రహారీ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని జోనల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతిని ఆదేశించారు. ఆదివారం వినాయకనగర్‌ పర్వతాంజనేయ స్వామి ఆలయంలో పవర్‌ బోర్‌వెల్స్‌ను ఆయన ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు.