News January 25, 2025
HYDలో అర్ధరాత్రి రూల్స్ బ్రేక్!

నగరంలో మిడ్‌నైట్ పలువురు వాహనదారులు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ జంప్ చేస్తున్నారు. పంజాగుట్ట, ఖైరతాబాద్, ఐటీ కారిడార్, కూకట్‌పల్లి తదితర ప్రధాన సిగ్నళ్ల వద్ద రాత్రి 11 దాటితే ఓవర్ స్పీడ్‌తో వెళుతున్నారని ఇతర వాహనదారులు వాపోతున్నారు. దీనికితోడు ఆకతాయిలు చేసే స్టంట్‌లతో ఇబ్బంది తలెత్తుతోందన్నారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News February 10, 2025
HYD: నుమాయిష్‌కు 80వేల మంది

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు సందర్శకులు భారీగా తరలివెళ్తున్నారు. జనవరి 3న ప్రారంభమైన నుమాయిష్‌కు లక్షల సంఖ్యలో సందర్శకులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం సెలవు దినం కావడంతో 80 వేల మంది నుమాయిష్‌ను సందర్శించినట్లు పేర్కొన్నారు. కాగా.. ఈనెల 15న నమాయిష్ ముగియనుంది.
News February 10, 2025
రంగారెడ్డి జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా

రంగారెడ్డి జిల్లా కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. రెడ్డిపల్లిలో 14.2℃, తాళ్లపల్లి 14.5, చందనవెల్లి 14.7, చుక్కాపూర్ 14.8, ఎలిమినేడు, కాసులాబాద్ 15.5, రాజేంద్రనగర్ 15.7, రాచలూరు, కేతిరెడ్డిపల్లి, తొమ్మిదిరేకుల 15.9, కొందుర్గ్, వెల్జాల 16.1, ప్రోద్దటూర్, సంగెం 16.3, వైట్‌గోల్డ్ SS 16.4, కడ్తాల్, మంగళపల్లి 16.5, యాచారం, మీర్‌ఖాన్‌పేట 16.7, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, కందువాడలో 16.8℃గా నమోదైంది.
News February 10, 2025
శంషాబాద్ నుంచి కుంభమేళాకు తరలివెళ్తున్న ప్రజలు

ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు భారీగా ప్రజలు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు వృద్ధులు, దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీలను ఏర్పాటు చేశారు. ఆదివారం అంతర్జాతీయ విమాన సర్వీసులో 84,593 మంది ప్రయాణించినట్లు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.