News March 23, 2024

HYD‌లో ఆక్రమణలు.. చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

image

నగరంలో నీటి వనరుల ఆక్రమణలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. బుద్ధభవన్‌లోని EVDM కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. GHMC పరిధి చెరువుల వద్ద FTC, బఫర్ జోన్ బౌండరీలకు సంబంధించిన మ్యాపులను ప్రదర్శించాలని సూచించారు. చెరువు బఫర్ జోన్‌లో నిర్మించే భవనాలను గుర్తించి తక్షణమే నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేశారు.

Similar News

News September 18, 2024

HYD: ఇబ్బందులు లేవు జనరల్ ట్రాఫిక్ వెళ్లొచ్చు: సీపీ

image

HYD సిటీ కమిషనర్ CV ఆనంద్ రంగంలోకి దిగారు. గణపతి నిమజ్జన చివరి ఘట్టం నేడు ఉదయం MJ మార్కెట్ రోడ్డుకు చేరుకుంది. ఎంజీ మార్కెట్ సహా, ట్యాంక్ బండ్ పరిసరాల పరిస్థితులను సీపీ పరిశీలించారు. కేవలం కొన్ని వాహనాలు మాత్రమే అప్రోచ్ రోడ్లలో ఉన్నాయని, తక్కువ సమయంలో నిమజ్జనం ముగుస్తుందని, జనరల్ ట్రాఫిక్ వెళ్లొచ్చన్నారు. గతం కంటే ఈసారి ఉదయం 5 గంటలకు, పరిస్థితి చాలా మెరుగుగా ఉందని అభిప్రాయపడ్డారు.

News September 18, 2024

RR:ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓నారాయణగూడ: టస్కర్ పై నుంచి పడి మహిళ మృతి
✓ఖైరతాబాద్: జులూస్ డ్యాన్స్ అదుర్స్
✓ఘట్కేసర్: మైనర్ బాలిక పై కేశవరెడ్డి(36) లైంగిక దాడి
✓మోడీకి బాలాపూర్ లడ్డు అందిస్తాం: శంకర్ రెడ్డి
✓HYDలో ఘనంగా జరిగిన విమోచన, ప్రజాపాలన, సమైక్యత వేడుకలు
✓ఖైరతాబాద్ గణనాథునికి పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
✓VKB: గల్లీ గల్లీలో గణనాథుని ఊరేగింపు

News September 17, 2024

HYD: నాన్న కోసం టస్కర్‌పై నుంచి దూకి యువతి మృతి

image

టస్కర్ కింద పడి ఓ యువతి మృతి చెందిన ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాలు.. నిన్న అర్ధరాత్రి హిమాయత్‌నగర్‌లో వినాయకుడిని తీస్కెళ్తున్న టస్కర్‌పై నుంచి ఎల్బీనగర్‌కు చెందిన మహేందర్ కిందపడ్డాడు. ఆయనకోసం కుమార్తె పూజిత (17) కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది.