News April 20, 2024

HYDలో ఆదివారం మటన్‌ షాపులు బంద్

image

ఏప్రిల్ 21న (ఆదివారం) మహవీర్‌ జయంతి వేడుకలు నిర్వహించేందుకు జైనులు సిద్ధమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్‌లో‌ వీరి సంఖ్య ఎక్కువే ఉండడంతో ఆ రోజు భారీ ర్యాలీలు తీయనున్నారు. ఈ నేపథ్యంలోనే GHMC పరిధిలో మాంసం దుకాణాలు (మటన్, పశువుల కబేళాలు, బీఫ్ షాపులు) మూసివేయనున్నారు. ఇందుకు సంబంధించి బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. SHARE IT

Similar News

News November 12, 2024

HYD‌లో తగ్గిన చికెన్‌ ధరలు!

image

HYDలో చికెన్ ధరలు‌ భారీగా తగ్గాయి. గత నెల రోజులుగా మాంసం KG రూ. 200కు పైగానే పలికింది. కార్తీక మాసం 2వ వారంలో ధరలు ఒక్కసారిగా తగ్గాయి. మొన్నటివరకు స్కిన్‌లెస్ రూ. 234 నుంచి రూ. 245, విత్ స్కిన్ రూ. 200 నుంచి రూ. 215 మధ్య విక్రయించారు. నేడు స్కిన్ లెస్ రూ. 218, విత్ స్కిన్ రూ. 191కి పడిపోయింది. కార్తీక మాసంలో మాంసానికి దూరంగా ఉండడంతో గిరాకీ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.

SHARE IT

News November 12, 2024

HYDలో సెక్షన్ 163 పరిధి కుదింపు

image

ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 27న నుంచి HYD, SEC వ్యాప్తంగా BNSS 163 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా సచివాలయ పరిధిలో 500 మీటర్ల వరకే BNSS 163(144 సెక్షన్‌) అమలులో ఉంటుందని పేర్కొంది. సెక్రటేరియట్ పరిసరాల్లో ధర్నాలు, ర్యాలీ‌ల నిషేధం అమలు కానుంది. ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా, ర్యాలీలకు అనుమతించింది. తదుపరి ఆదేశాల వరకు ఈ సెక్షన్ అమలులో ఉంటుంది.

News November 12, 2024

HYD: మహిళలు ముందుండడం గర్వంగా ఉంది: సుమ

image

బేగంపేటలో నిర్వహించిన మహిళా ప్రోగ్రాంలో యాంకర్ సుమ పాల్గొన్నారు. సుమ మాట్లాడుతూ.. భారతదేశపు అసలైన నిధి మహిళలే అని అన్నారు. ఆర్థికంగా మహిళా శక్తి ఎదుగుతుండటం తనకు ఎంతో గర్వంగా ఉందని అభిప్రాయపడ్డారు. పోటీ ప్రపంచంలో మహిళలు ముందుండడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, విద్యతో ఎన్నో సాధించవచ్చన్నారు. మహిళలకు స్వేచ్ఛ ఎంతో అవసరమని పేర్కొన్నారు.