News March 10, 2025
HYDలో ఇవి ఇప్పుడు తప్పనిసరి

ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతుండడంతో వైద్యులు ప్రజలకు పలు సూచనలు చేశారు.
– నీళ్లు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ద్రవదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
– బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, రుమాలు, తలపాగా ధరించాలి.
– రోడ్లపై అమ్మే వేడి పదార్థాలను తినడం తగ్గించాలి.
– దోస, పుచ్చ, తాటి ముంజలతో పాటు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.
– ఎండలో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు తిరగకూడదు.
Similar News
News March 10, 2025
సీఐడీ చేతికి ఫాల్కన్ ఇన్వెస్టింగ్ కేసు!

తెలంగాణ సీఐడీ చేతికి ఫాల్కన్ కేసు వెళ్లనుంది. ఇప్పటివరకు 19 మంది నిందితుల్లో ముగ్గురు అరెస్ట్ కాగా కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఫాల్కన్ కేసును సీఐడీ బదిలీకి సైబరాబాద్ పోలీసుల నిర్ణయం తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్లో 3 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణతో పాటు ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలో వేల సంఖ్యలో బాధితులున్నారు. సైబరాబాద్ పోలీసులు సీఐడీకి అప్పజెప్పే అవకాశం కనబడుతోంది.
News March 10, 2025
HYD: సీఎంని కలిసిన అద్దంకి దంపతులు

సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ దంపతులు కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంని కలిసి.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను కాంగ్రెస్ ప్రకటించడంతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు శాలువ కప్పి పుష్పగుచ్ఛం అందించారు.
News March 10, 2025
HYD: సీఎం రేవంత్ దిగజారుస్తున్నారు: కవిత

చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ ప్రతిష్ఠను సీఎం రేవంత్ రెడ్డి దిగజారుస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉన్నతంగా ఉందని ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తే.. ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర పరిస్థితి బాగోలేదని అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.