News March 10, 2025
HYDలో ఇవి ఇప్పుడు తప్పనిసరి

ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతుండడంతో వైద్యులు ప్రజలకు పలు సూచనలు చేశారు.
– నీళ్లు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ద్రవదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
– బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, రుమాలు, తలపాగా ధరించాలి.
– రోడ్లపై అమ్మే వేడి పదార్థాలను తినడం తగ్గించాలి.
– దోస, పుచ్చ, తాటి ముంజలతో పాటు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.
– ఎండలో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు తిరగకూడదు.
Similar News
News November 4, 2025
ఉప్పలగుప్తం: నాచుతో డబ్బులే డబ్బులు

అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో పాటు మరో రెండు జిల్లాలను సముద్రపు నాచు పెంపకానికి ఎంపిక చేసినట్లు అమృతానంద విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అమృత నటరాజన్ తెలిపారు. నాచును ఆహారంగా తీసుకుంటున్న జపాన్ దేశస్థుల ఆయుష్షు పెరిగినట్టు సర్వేలు వెల్లడించాలని ఆయన అన్నారు. ఉప్పలగుప్తం(M) వాసాలతిప్పలో సోమవారం మత్స్యకారులకు నాచు పెంపకంపై అవగాహన కల్పించారు. ఎరువులు వాడకుండానే 45 రోజులకు నాచు ఉత్పత్తి వస్తుందని వివరించారు.
News November 4, 2025
రేపు కడపకు రానున్న AR రెహమాన్

ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహమాన్ రేపు కడపకు రానున్నారు. కడప నగరంలో ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో భాగంగా నిర్వహించే గంధం వేడుకకు ఆయన హాజరుకానున్నారు. దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాలకు ప్రతి ఏడాది ఆనవాయితీగా ఆయన వస్తుంటారు. రేపు రాత్రి దర్గాలో జరిగే గంధ మహోత్సవం వేడుకలకు పీఠాధిపతితో కలిసి ఆయన దర్గాలో ప్రార్థనలు చేయనున్నారు.
News November 4, 2025
జగన్ కాన్వాయ్ను అనుసరిస్తుండగా బైక్ ప్రమాదం

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటన సందర్భంగా ప్రమాదం జరిగింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్న జగన్ కాన్వాయ్ను బైక్పై అనుసరిస్తున్న ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. పామర్రు మండలం కనుమూరు గ్రామ పరిధిలోని రొయ్యల ఫ్యాక్టరీ వద్ద అదుపుతప్పి పడిపోవడంతో ఆ ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.


