News November 30, 2024

HYDలో ఈ రోజే చివరి అవకాశం: HMWSSB

image

HYDలో పెండింగ్‌లో ఉన్న నీటి బిల్లుల చెల్లింపునకు వన్ టైమ్ సెటిల్ మెంట్-2024 పథకం నేటితో ముగియనుంది. బిల్లు మొత్తం కడితే ఎలాంటి వడ్డీ, ఆలస్య రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. గడువు పూర్తయిన తర్వాత చెల్లిస్తే వడ్డీతో పాటు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. లేనిపక్షంలో రేపటి నుంచి చర్యలు తీసుకుంటామని HMWSSB ట్వీట్ చేసింది. అవసరమైతే నల్లా కనెక్షన్ సైతం తొలగిస్తాని స్పష్టం చేసింది.
SHARE IT

Similar News

News November 20, 2025

HYD: కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదు: చనగాని

image

ఈ కార్ రేసు అవినీతిలో మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఛార్జ్ షీట్ కోసం గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు, సీఎం అంటే గౌరవంలేకుండా పొగరుగా వ్యవహిరించడం ప్రజాస్వామ్యానికి అవమానకరం అన్నారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా నిధుల దుర్వినియోగం చేసి రాష్ట్ర ఖజానాకు గండి కొట్టారని ఆరోపించారు.

News November 20, 2025

HYD: మంత్రి శ్రీహరిని కలిసిన చిన్న శ్రీశైలం యాదవ్

image

మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి వాకిటి శ్రీహరిని చిన్న శ్రీశైలం యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తన కుమారుడు నవీన్ యాదవ్ గెలుపునకు కృషి చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించారు.

News November 20, 2025

HYD: రాహుల్ ద్రవిడ్‌తో ఫ్రీడం ఆయిల్ ‘కోచింగ్ ది కోచ్’

image

ప్రముఖ వంట నూనె బ్రాండ్లలో ఒకటైన ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో రాహుల్ ద్రవిడ్ ప్రముఖంగా కనిపిస్తారని ఆ సంస్థ తెలిపింది. DRS (డిసీషన్ రివ్యూ సిస్టమ్) VS PRS (ప్యాక్ రివ్యూ సిస్టమ్)తో ప్రచారం చేయనుంది. ఈ భావనను ఉపయోగించి తమ కొత్త ‘కోచింగ్ ది కోచ్’ ప్రచారాన్ని ప్రారంభించింది. వినియోగదారులకు లీటర్ ఆయిల్ ప్యాకెట్‌ 910గ్రా. బరువుండాలని అవగాహన కల్పించనుంది.