News November 30, 2024

HYDలో ఈ రోజే చివరి అవకాశం: HMWSSB

image

HYDలో పెండింగ్‌లో ఉన్న నీటి బిల్లుల చెల్లింపునకు వన్ టైమ్ సెటిల్ మెంట్-2024 పథకం నేటితో ముగియనుంది. బిల్లు మొత్తం కడితే ఎలాంటి వడ్డీ, ఆలస్య రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. గడువు పూర్తయిన తర్వాత చెల్లిస్తే వడ్డీతో పాటు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. లేనిపక్షంలో రేపటి నుంచి చర్యలు తీసుకుంటామని HMWSSB ట్వీట్ చేసింది. అవసరమైతే నల్లా కనెక్షన్ సైతం తొలగిస్తాని స్పష్టం చేసింది.
SHARE IT

Similar News

News December 7, 2024

సరూర్‌నగర్ BJP సభ (అప్‌డేట్స్)

image

సరూర్‌నగర్‌ సభ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపామని BJP నేతలు పేర్కొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, BJP ఎమ్మెల్యేలు, హైదరాబాద్, రంగారెడ్డికి చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజల పక్షాణ BJP నిరంతరం పోరాటం చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు.

News December 7, 2024

ఖైరతాబాద్: తెలంగాణ తల్లి విగ్రహ అవిష్కరణ.. కేంద్రమంత్రికి ఆహ్వానం

image

రాజ్‌భవన్ దిల్ కుశా గెస్ట్‌హౌస్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. ఈ సందర్భంగా ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకూ రావాలన్నారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు పొన్నం తెలిపారు.

News December 7, 2024

సోనియాగాంధీ జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తాం: మహేశ్ కుమార్ గౌడ్

image

తెలంగాణ ప్రదాత ప్రియతమ నాయకురాలు సోనియాగాంధీ 78వ జన్మదిన వేడుకలను డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 10 ఏళ్లళ్లో BRS ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే చేసిచూపించిందన్నారు. ఇప్పటివరకు 55వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు.