News June 11, 2024

HYDలో ఉద్యోగాలు.. జీతం రూ.లక్ష

image

HYD తార్నాకలోని ICMRకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) కింద ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసై పని అనుభవం ఉండాలి. పోస్టును అనుసరించి రూ.18,000 నుంచి రూ.1,12,400 జీతం ఉంటుంది. జూన్ 16లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు https://www.nin.res.in/employement.html వెబ్‌సైట్ చూడండి. SHARE IT

Similar News

News October 28, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక BRSకు ఫైనల్ పరీక్ష

image

BRS నేతలు మహిళల కన్నీళ్లను కూడా రాజకీయం కోసం వాడుకోవడం దుర్మార్గమని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కాల్వ సుజాత అన్నారు. గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో మహిళలను గౌరవించే సంప్రదాయం లేదని, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక BRSకు ఫైనల్ పరీక్ష అని పేర్కొన్నారు.

News October 28, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: ప్రతి 100 ఓట్లకు ఒకరికి బాధ్యత

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఒక్క ఓటు కూడా మిస్ కావొద్దని కాంగ్రెస్ భావిస్తోంది. 100% పోలింగ్ జరిగేలా చూసి తమ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించేలా చూడాలని ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా ప్రతీ వంద మంది ఓటర్లకు ఒకరిని ఇన్‌ఛార్జిగా నియమించనుంది. ఆ ఇన్‌ఛార్జి ఆ ఓటర్లను కలిసి తప్పనిసరిగా ఓటువేసేలా జాగ్రత్తలు తీసుకోనుంది. ఇందుకు సంబంధించి మంత్రి పొన్నం ఆధ్వర్యంలో నాయకులు చర్చలు నిర్వహించారు.

News October 28, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: మహిళలు.. కేవలం 7 శాతమేనా!

image

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను రాజ్యాంగం కల్పించింది. అయితే వివిధ రాజకీయ పార్టీలు మహిళలకు పోటీచేసే అవకాశం ఇవ్వడం లేదు. ఇపుడు జూబ్లీహిల్స్ బైపోల్‌లోనూ అదే పరిస్థితి. కేవలం 7% మంది మాత్రమే పోటీచేస్తున్నారు. మొత్తం 58 మంది ఈ ఎన్నికల్లో బరిలో ఉండగా కేవలం నలుగురే పోటీలో ఉన్నారు. దీంతో.. ఇదేనా మహిళలకు దక్కే సమానత్వం అని పలువురు వాపోతున్నారు.