News June 11, 2024
HYDలో ఉద్యోగాలు.. జీతం రూ.లక్ష

HYD తార్నాకలోని ICMRకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) కింద ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసై పని అనుభవం ఉండాలి. పోస్టును అనుసరించి రూ.18,000 నుంచి రూ.1,12,400 జీతం ఉంటుంది. జూన్ 16లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు https://www.nin.res.in/employement.html వెబ్‌సైట్ చూడండి. SHARE IT
Similar News
News March 21, 2025
HYD: ఇరుకుగదిలో ‘అంగన్‌వాడీ’

అంగన్‌వాడీ కేంద్రాలు పసిప్రాణాలకు నరకప్రాయంగా మారాయి. ఇరుకు గదుల్లో గాలి, వెలుతురు లేక చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. బహదూర్‌పురా మం.లో అనేక కేంద్రాలు అద్దె భవనాలలో నడుస్తున్నాయి. విశాలమైనవి తీసుకోవాలంటే కిరాయి భారం అవుతోంది. ప్రభుత్వం నుంచి అద్దెలు సకాలంలో రాక, టీచర్లు జీతం నుంచే కిరాయి కట్టాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఇకనైనా దీనిపై ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు.
News March 21, 2025
HYDలో అడవిని సృష్టించలేం.. కానీ..!

మన HYDలో అడవిని సృష్టించలేము. కానీ, ప్రయత్నం చేద్దాం. ‘రాజధాని’ కాంక్రిట్ జంగిల్‌గా మారడంతో గల్లీ గల్లీకి సీసీ రోడ్డు వస్తున్నాయే తప్పా.. ఓ మొక్క నాటడానికి జాగ దొరుక్తలేదు. హరితహారం, వన మహోత్సవం అంటూ ప్రభుత్వాలు గొప్ప పనే చేస్తున్నాయి. కానీ, సామాజిక బాధ్యతగా చెట్లను రక్షించాల్సిన మనం ఏం చేస్తున్నాం? అసలే ఎండకాలం. నీడనిచ్చే చెట్లను కాపాడుకుందాం.
నేడు ప్రపంచ అటవీ దినోత్సవం.
SAVE TREES.
News March 21, 2025
HYDలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

హజ్రత్ అలీ వర్ధంతి సందర్భంగా నేడు చార్మినార్ నుంచి మస్జిద్-ఇ-ఇమామియా వరకు జరిగే ఊరేగింపు కారణంగా మ. 2:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని HYD ట్రాఫిక్ జాయింట్ సీపీ తెలిపారు. నయాపూల్, చట్టాబజార్, పురాణిహవేలి, దారులషిఫా గ్రౌండ్స్, ఎస్జే రోటరీ, దబీర్‌పురా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ప్రయాణికులు ట్రాఫిక్ అప్డేట్స్‌ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలని సూచించారు.