News February 12, 2025
HYDలో ఉరేసుకున్న తూ.గో యువకుడు

ఉప్పలగుప్తంకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కొర్లపాటి శేషురావు (39) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో ఈ ఘటన మంగళవారం జరిగింది. అద్దెకుంటున్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని చెబుతున్నారు. శేషురావు మృతదేహాన్ని ఉప్పలగుప్తం తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
Similar News
News November 28, 2025
రాజానగరం: ధాన్యం కొనుగోళ్లపై జేసీ ఆరా

రాజానగరం మండలంలోని జి. ఎర్రంపాలెంలో ఈ ఖరీఫ్ సీజన్లో వరి పండించిన రైతులతో జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ శుక్రవారం స్వయంగా మాట్లాడారు. పంట దిగుబడి వివరాలను తెలుసుకున్న ఆయన.. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా అని ప్రశ్నించారు. రైస్ మిల్లర్లకు తోలిన ధాన్యానికి సంబంధించిన నగదు 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతుందా లేదా అని ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News November 28, 2025
రైతన్నా మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్.!

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 24 నుంచి 29 వరకు నిర్వహిస్తున్న ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి శుక్రవారం దొర్నిపాడు మండలం గుండుపాపుల గ్రామం సందర్శించారు. కలెక్టర్ రైతుల ఇళ్ల వద్దకువెళ్లి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి పథకాల లబ్ధి అందుతున్న విధానంపై రైతులు వెంకటేశ్వర్లు, చిన్న దస్తగిరిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News November 28, 2025
HYD: సిబ్బంది లేమి.. నియామకాలేవి: పద్మనాభరెడ్డి

రాష్ట్రంలోని 25 కొత్త ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది లేమి తీవ్రంగా ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సీఎంకి లేఖ రాసింది. 1,413 మంది కావాల్సిన చోట 111 మంది మాత్రమే పనిచేస్తున్నారని, 22 ఆస్పత్రుల్లో ఒక్క నియామకం జరగలేదని లేఖలో పేర్కొన్నారు. సిబ్బంది లేక దవాఖానాలు మూతబడి, వాటిలో కొన్ని చోట్ల అసాంఘిక చర్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 1,302 పోస్టులను భర్తీ చేసి ఆస్పత్రులు ప్రారంభించాలన్నారు.


