News March 29, 2024
HYDలో ఎయిర్‌గన్‌తో వార్నింగ్.. ఇద్దరు అరెస్ట్

ఎయిర్‌గన్ తలకు పెట్టి బెదిరించిన ఇద్దరిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం ACP వెంకటేశ్వరరావు కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 27న మీర్‌చౌక్ PS పరిధి ఎతేబర్ చౌక్‌లోని పెట్రోల్ బంకులో భక్షి అలీ, జాహి అనే ఇద్దరు సిబ్బందితో గొడవపడ్డారు. ఈ క్రమంలోనే తమ వద్ద ఉన్న ఎయిర్‌గన్ తీసి చంపేస్తామని బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు ACP తెలిపారు.
Similar News
News November 25, 2025
బల్దియా.. బస్తీమే Kya Kiya?

నేటి GHMC సర్వసభ్య సమావేశాలు అసెంబ్లీ చర్చలను మించేలా ఉన్నాయి. గతంలోనూ నిర్ణీత సమయంలో ఒక అంశం మీద చర్చ జరుగుతుంటే మరోవైపు నిరసనలతో సభ రసాభాసాగా మారింది. ప్రతిసారి ఇదే తంతు అన్న విమర్శలొచ్చాయి. అసలు చర్చ పక్క దారి పడుతోందని కొందరు సభ్యులు మొరపెట్టుకున్నారు. అయితే, <<18381319>>సిటీలోని బస్తీల్లో<<>> సమస్యలు తాండవిస్తున్నాయని, నేడు అయినా వీటిపై చర్చించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
News November 25, 2025
రేపు హైదరాబాద్‌లో వాటర్ బంద్

నగరానికి తాగునీటిని అందించే కృష్ణ ఫేజ్-1, 2, 3లో పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేసే ఫీడర్లు, ట్రాన్స్ ఫార్మర్ల స్థానంలో కొత్తవి అమర్చనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉ.10 గం. నుంచి సా.4 గం. వరకు నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. చార్మినార్, వినయ్‌నగర్, భోజగుట్ట, రెడ్‌హిల్స్, నారాయణగూడ, ఎస్సార్ నగర్, హయత్‌నగర్, ఉప్పల్, రాజేంద్రనగర్, మీర్పేట్ తదితర ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందన్నారు.
News November 24, 2025
HYD: రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతాం: KTR

తెలంగాణ బీసీలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన అన్యాయని ఢిల్లీలో ఎండగడతామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి రిజర్వేషన్ల పెంపు జరగకముందే 42% బీసీలకు రిజర్వేషన్లు తెలంగాణలో ఇచ్చినట్టు రాహుల్ గాంధీ చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఆరోపించారు. ఆయన చేస్తున్న మోసాన్ని దేశ ప్రజల ముందు ఉంచుతామని పేర్కొన్నారు.


