News March 29, 2024

HYDలో ఎయిర్‌గన్‌తో వార్నింగ్.. ఇద్దరు అరెస్ట్

image

ఎయిర్‌గన్‌‌ తలకు పెట్టి బెదిరించిన ఇద్దరిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం ACP వెంకటేశ్వరరావు కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 27న మీర్‌చౌక్‌ PS పరిధి ఎతేబర్‌ చౌక్‌లోని పెట్రోల్ బంకులో భక్షి అలీ, జాహి అనే ఇద్దరు సిబ్బందితో గొడవపడ్డారు. ఈ క్రమంలోనే తమ వద్ద ఉన్న ఎయిర్‌గన్‌ తీసి చంపేస్తామని బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు ACP తెలిపారు.

Similar News

News January 17, 2025

BRAOUలో ట్యూషన్ ఫీజుకు చివరితేదీ జనవరి 25

image

డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ సార్వతిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ, 2nd, 3rd ఇయర్ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు చెల్లించడానికి చివరితేదీ జనవరి 25 అని విద్యార్థి సేవల విభాగాల అధిపతి డా.వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులు ఇప్పటికే అడ్మిషన్ పొంది సకాలంలో ఫీజు చెల్లించలేకపోయినవారు ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలని కోరారు. సందేహాలుంటే 040-236080222 హెల్ప్ లైన్ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించారు.

News January 17, 2025

ఇబ్రహీంపట్నం: కూతురు వరసయ్యే బాలికపై అత్యాచారం

image

కూతురు వరసైన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆదిభట్ల PS పరిధిలో జరిగింది. పోలీసుల కథనం.. తుర్కయంజాల్‌కు చెందిన ఆంజనేయులుకు వరుసకు కూతురయ్యే బాలిక పుట్టినరోజు సందర్భంగా కొత్త బట్టలు కొనిస్తానని ఇంట్లో చెప్పి తుర్కయంజాల్‌లోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అనంతరం బాలిక కేకలు వేస్తూ బయటకు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు.

News January 17, 2025

HYD: జంట హత్యల కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు

image

నార్సింగి PSలో <<15169186>>జంట హత్య<<>>కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం.. సాకేత్‌కు బిందుతో పరిచయం ఏర్పడింది. అనంతరం సాకేత్ సాయంతో బిందు వ్యభిచారం మొదలుపెట్టింది. ఈ క్రమంలో అంకిత్ స్నేహితుడు రాహుల్ బిందుతో ఏకాంతంగా గడిపి వీడియో తీసేందుకు యత్నించాడు. ఆమె అడ్డు చెప్పి అక్కడి నుంచి వచ్చి సాకేత్‌కు చెప్పడంతో రాహుల్‌ను హెచ్చరించాడు. దీంతో రాహుల్ కక్ష పెంచుకుని మరో ఇద్దరితో కలిసి హతమార్చాడు.