News April 5, 2025

HYDలో ఏప్రిల్ 6న వైన్స్‌లు బంద్

image

శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6, 2025న ఉ.10:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు వైన్స్‌లు బంద్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వుల జారీ చేసింది. దీని పరిధిలోని కల్లు, వైన్ షాపులు, రెస్టారెంట్ల అనుబంధ బార్లు, మిలిటరీ కాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్ దీని పరిధిలోకు వస్తాయి. ఈ విషయాన్ని అందరూ గమనించాలని రాచకొండ పోలీసులు కోరారు.

Similar News

News April 19, 2025

కామారెడ్డి: ఏపీ మంత్రిని కలిసిన ప్రభుత్వ సలహాదారు

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శనివారం హైదరాబాద్‌లోని హాజ్ హౌస్‌లో ఆంధ్రప్రదేశ్ మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఫరూక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హజ్ యాత్రకు వెళ్లే ఇరు రాష్ట్రాల యాత్రికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఇరువురు చర్చించారు. అంతకుముందు మంత్రిని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శాలువా కప్పి సత్కరించారు.

News April 19, 2025

కామారెడ్డి: కఠిన శిక్షలు పడితేనే నేరాలు తగ్గుతాయి: SP

image

నేరాలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలు పడినప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుందని KMR జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన కోర్టు డ్యూటీ పోలీసు అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగేలా కోర్టు డ్యూటీ అధికారులు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. వారెంట్లు, సమన్లు వేగంగా ఎగ్జిక్యూట్ చేసి ట్రయల్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News April 19, 2025

నిర్మల్‌లో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత

image

నిర్మల్ జిల్లాలో శనివారం 42.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఓవైపు ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరోవైపు అనుకోని అకాల వర్షాలు కురుస్తున్నాయన్నారు. జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం 42.5, సోమవారం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

error: Content is protected !!