News January 8, 2025
HYDలో ఒకేసారి పూసిన 92 పువ్వులు

అరుదుగా కనిపించే బ్రహ్మ కమలాలు ఒకేసారి 92 వికసించాయి. మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడలోని ధనలక్ష్మి రమణమూర్తి ఇంట్లో చెట్టుకు ఈ అద్భుతం జరిగింది. ఒకే రోజు పదుల సంఖ్యలో పూలు పూయడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఏడాదికి ఒకేసారి పూసే బ్రహ్మకమలాలు విరివిగా పూయడం విశేషం.
Similar News
News December 3, 2025
గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు

గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏఏ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలనే విషయం ఖరారైంది. సమ్మిట్కు హాజరయ్యే అతిథులను అలరించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. మొదటి రోజు (సోమవారం) మధ్యాహ్నం పేరిణి నృత్యం, రాత్రి కొమ్ము కోయ డాన్స్, కీరవాణి సంగీత కార్యక్రమం, రెండో రోజు(మంగళవారం) ఉదయం వీణ వాయిద్యం, రాత్రి గ్రాండ్ ఫినాలే, డ్రోన్ షో, గుస్సాడి నృత్యం, ఫ్యూజన్ సంగీతం ఉండనుంది.
News December 3, 2025
గ్లోబల్ సమ్మిట్.. ప్రజాభవన్లో వార్ రూమ్

8, 9 తేదీల్లో ప్రభుత్వం పెట్టుబడుల కోసం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పనులు మరింత వేగవంతం చేసేందుకు, మీట్ను సక్సెస్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసింది. బేగంపేటలోని ప్రజాభవన్లో ఈ వార్ రూమ్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
News December 3, 2025
HYD: నేతలను వెంటాడుతున్న నిరుద్యోగం

ORR పరిధిలోని 20 పట్టణాలు, 7 నగరాలను GHMCలో విలీనం చేయనున్నారు. ఇది రాజకీయంగా ఎదగాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లింది. గ్రామంలో సర్పంచ్, వార్డ్ మెంబర్గా రాణిద్దామనుకునేలోపే మున్సిపాలిటీ చేశారు. తీరా పట్టణాలను బల్దియాలో విలీనం చేస్తుండడంతో రాజకీయ అవకాశాలు 30%పైగా తగ్గుముఖం పట్టనున్నాయి. నిరుద్యోగం విద్యార్థులనే కాదు.. నాయకులను సైతం వెంటాడుతోంది. మహా నగరంలో రాజకీయంగా ఎదగడం ఎలా? అని ఆలోచనలో పడ్డారు.


