News June 5, 2024
HYDలో ఒకే ఒక్కరు..!

HYDలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క అసెంబ్లీ సీటు కూడా రాలేదు. రాష్ట్రంలోని రూరల్ ప్రాంతాల్లో గెలుపుతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి గ్రేటర్లో గెలవలేదనే నిరాశ ఉండేది. కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ 13,206 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రాజధానిలో ఆయన గెలవడం క్యాడర్లో సంతోషం నింపింది. ఖైరతాబాద్ BRS MLA దానం చేరికతో కాంగ్రెస్ బలం 2కి చేరింది.
Similar News
News November 4, 2025
వారంలో 3-5 ప్రమాదాలు..నిర్లక్ష్యపు నిద్రలోనే అధికారులు

నిన్న ప్రమాదం జరిగి 19 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రజలను కలచివేస్తోంది. ప్రమాదం జరిగిన ఈ రోడ్డుపై (హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు) వారానికి 3 నుంచి 5 ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలకు కనిపించడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప స్పందించని పాలకులు, అధికారులు ఉన్నంతవరకు ప్రజలు ఇలా ప్రాణాలు కోల్పోవాల్సిందేనా?
News November 4, 2025
HYD: ఆపండయ్యా మీ రాజకీయం.. ‘ఆడ’పిల్లలను ఆదుకోండి!

మీర్జాగూడ ఘటనపై నేతల హంగామా తీవ్ర విమర్శలకు దారి తీసింది. మృతదేహాల మధ్య హైవే సాంక్షన్ చేశామని ఒకరు, నిధులు మంజూరు చేశామని మరొకరు, పనులు మొదలుపెట్టిందే మేమని ఇంకొకరు గొప్పలు చెప్పుకున్నారు. ‘ఎంత చెప్పినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ పేద కుటుంబం పెద్దలను కోల్పోయింది. ఆడపిల్లలు రోడ్డున పడ్డారు. గతాన్ని మార్చలేము. యాలాలలోని హాజీపూర్‌లో అనాథలైన <<18187789>>భవానీ, శివాలీ<<>>ని ఆదుకోండి’ అంటూ ప్రజలు కోరుతున్నారు.
News November 4, 2025
గచ్చిబౌలి: కో-లివింగ్‌లో RAIDS.. 12 మంది అరెస్ట్

గచ్చిబౌలి TNGOకాలనీలోని కో-లివింగ్ రూమ్స్‌లో పోలీసులు మెరుపుదాడులు చేశారు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని SOT పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోన్న గుత్తా తేజతో పాటు మరో నైజీరియన్ హైదరాబాద్ యువతకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ రైడ్స్‌లో ఆరుగురు డ్రగ్ పెడ్లర్స్, ఆరుగురు కన్జ్యూమర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. MDMAతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.


