News June 5, 2024

HYDలో ఒకే ఒక్కరు..!

image

HYDలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క అసెంబ్లీ సీటు కూడా రాలేదు. రాష్ట్రంలోని రూరల్‌ ప్రాంతాల్లో గెలుపుతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి గ్రేటర్‌లో గెలవలేదనే నిరాశ ఉండేది. కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ 13,206 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రాజధానిలో ఆయన గెలవడం క్యాడర్‌లో సంతోషం నింపింది. ఖైరతాబాద్ BRS MLA దానం చేరికతో కాంగ్రెస్ బలం 2కి చేరింది.

Similar News

News February 25, 2026

సైబరాబాద్‌ కమిషనరేట్‌కు కొత్తగా 2 పోలీస్ కేనైన్‌లు

image

తెలంగాణ సీఐడీ నుంచి రెండు పోలీస్ కేనైన్‌లు సైబరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ అయ్యాయి. దీంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న జాగిలాల సంఖ్య18కు చేరింది. పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల గుర్తింపు, ట్రాకింగ్ వంటి కీలక విధుల్లో ఇవి సేవలందించనున్నాయి. సీఐడీ నుంచి వచ్చిన ‘రానా’ (బెల్జియన్ మాలినోయిస్), ‘రాడో’ (లాబ్రడార్) నేరాల ఛేదనలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు.

News February 25, 2026

RR: ఎగ్జామ్‌కు READY అయ్యారా?

image

ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. రంగారెడ్డిలో 180 పరీక్షా కేంద్రాలు ఉండగా.. 84,301 మంది 1st ఇయర్ విద్యార్థులు, 70,171 మంది 2nd ఇయర్ విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 1,54,472 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మాస్ కాపీయింగ్‌ జరగకుండా అలర్ట్ ఇచ్చే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమల్లో ఉంది. హాల్ టికెట్, పెన్నులు మర్చిపోకండి. ప్రశాంతంగా ఉండండి.

News February 25, 2026

ఫిల్మ్‌నగర్: సినిమా అవకాశం పేరుతో అసభ్యంగా ప్రవర్తన

image

సినిమాల్లో అవకాశాలంటూ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. ఏపీకి చెందిన ఓ యువతి సినిమా అవకాశాల కోసం నగరానికి రాగా, స్నేహితురాలి ద్వారా జీఎం రవి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. లుక్ టెస్ట్, స్కిన్ టెస్ట్ పేరుతో కార్యాలయానికి పిలిపించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.