News January 22, 2025

HYDలో ఒకే ఒక పోస్ట్.. శాలరీ రూ. 1,25,000

image

జర్నలిజంలో అనుభవం ఉన్నవాళ్లకు ఇదొక గొప్ప అవకాశం. నెలకు రూ. 80 వేల నుంచి రూ. 1,25,000 వేతనం పొందవచ్చు. ఇటీవల ప్రసార భారతి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ బేసిక్ కింద హైదరాబాద్‌లో సీనియర్ కరస్పాండెంట్ ఒక పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిగ్రీ, PG డిప్లొమా, MCJ చేసినవారు అర్హులు. మీడియా రంగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తు లాస్ట్ డేట్: JAN 31.
LINK: https://prasarbharati.gov.in
SHARE IT

Similar News

News October 16, 2025

RR: మద్యం దుకాణాలకు టెండర్లు పోటీ

image

సరూర్‌నగర్ ఎక్సైస్ జిల్లాలో 138 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయగా, ఇప్పటివరకు 1300కిపైగా దరఖాస్తులు అందినట్లు DPEO ఉజ్వల రెడ్డి తెలిపారు. సరూర్‌నగర్‌లో 32కి 500, హయత్‌నగర్ 28కి 510, ఇబ్రహీంపట్నంలో 19కి 100, మహేశ్వరంలో 14కి 150, అమన్‌గల్ 17కి 50, షాద్‌నగర్ 28కి 100 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. మరో 2 రోజుల సమయం ఉండటంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అన్నారు.

News October 14, 2025

RR: ‘ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు తావు ఇవ్వొద్దు’

image

వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా, అక్రమాలకు తావు లేకుండా జరగాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సూచించారు. కొనుగోలు కేంద్రాల అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, మిల్లర్లు, సివిల్ సప్లయ్ అధికారులతో మంగళవారం ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీఎస్ఓ వనజాత, డీఏఓ ఉష తదితరులు పాల్గొన్నారు.

News October 14, 2025

రంగారెడ్డి జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన కరవు

image

రంగారెడ్డి జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన కరవైంది. మద్యం టెండర్ల దాఖలు కోసం మరో 4 రోజులు మాత్రమే గడువు ఉన్నప్పటికీ టెండర్లు దాఖలు చేయడానికి వ్యాపారులు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 249 మద్యం షాపులకు గాను కేవలం 1,253 మాత్రమే దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో వైన్ షాపులకు జిల్లాలో ఎక్కడా లేనివిధంగా పోటీ ఉండేది. కానీ రియల్ ఎస్టేట్ ప్రభావం వైన్స్ టెండర్లపై పడింది.