News January 28, 2025
HYDలో ఒకే వాహనానికి 3 నంబర్ ప్లేట్‌లు

ఒకే వాహనానికి 3 నంబర్ ప్లేట్‌లు బిగించి HYDలో అడ్డంగా దొరికిపోయారు. సోమవారం సాయంత్రం నాగోల్‌లో అధికారులు తనిఖీలునిర్వహించారు. UP నుంచి HYD వస్తున్న ఓ వెహికిల్‌ను ఆపి చెక్ చేశారు. UP, AP, తెలంగాణ స్టేట్‌లకు చెందిన 3 నంబర్ ప్లేట్లు ఒకదానిపై ఒకటి ఉన్నట్లు గుర్తించారు. సదరు వాహనాన్ని సీజ్ చేసి నాగోల్ డ్రైవింగ్ ట్రాక్ ప్రాంతానికి తరలించినట్లు వెహికల్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ రెడ్డి వెల్లడించారు.
Similar News
News February 17, 2025
గ్రేటర్ HYDలో తగ్గిన భూగర్భ జలాలు

గ్రేటర్ పరిధిలో భూగర్భ జల శాఖ విశ్లేషణలో HYD ఔటర్ రింగ్ రోడ్డు వరకు 53 ప్రదేశాల్లో భూగర్భ జలాల వివరాలు వెల్లడయ్యాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది జనవరిలో భూగర్భ జలాలు 1.33 మీటర్లు తక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 33 ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గగా, 20 ప్రాంతాల్లో మెరుగ్గా ఉన్నట్లు పేర్కొన్నారు. జనవరి చివరి నాటికి సరాసరిగా 9.4 మీటర్ల భూగర్భ జలాలు ఉన్నాయి.
News February 16, 2025
HYD: హడలెత్తిస్తున్న వరుస హత్యలు

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస హత్యలు స్థానికులను హడలెత్తిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు హత్యలు జరిగాయి. నేడు పట్టపగలు మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై గూగులోత్ ఉమేశ్ (23)ను వెంబడించి మరీ అతని తమ్ముడు రాకేశ్ మరో వ్యక్తితో కలిసి హత్య చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
News February 16, 2025
HYD: నుమాయిష్‌కు రేపే లాస్ట్

HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు సందర్శకులు పోటెత్తుతున్నారు. రేపు చివరి రోజు కావడంతో నుమాయిష్‌ను సందర్శించేందుకు భారీగా తరలివస్తున్నారు. శనివారం రికార్డు స్థాయిలో 90 వేల మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు సొసైటీ బుకింగ్ కమిటీ కన్వీనర్ సత్యేందర్, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి సురేందర్ రెడ్డి తెలిపారు. జనవరి 3వ తేదీన ప్రారంభమైన నుమాయిష్ రేపటితో ముగియనున్న విషయం తెలిసిందే.